ఎక్కువగా మగ స్నేహితులు ఉంటే అమ్మాయికి ఇన్ని లాభాలు

ఆడవారికి మగస్నేహితులు, మగవారికి ఆడస్నేహితులు ఉండే మ్యెచూరిటి ఇప్పటికే మన పట్టణాల్లో వచ్చేసింది.ఏ ఫ్రెండ్ షిప్ గ్యాంగ్ ని చూసినా, ఇటు మగవారు, అటు ఆడవారు, కలిసే కనిపిస్తున్నారు.

 Benefits A Girl Gets With More Male Friends-TeluguStop.com

ఇక అమ్మాయి ఎక్కువగా మగ స్నేహితులతో ఉంటేనే మంచిది అని సూచిస్తున్నారు మానసిక నిపుణులు.అలా ఎందుకు అంటే …

* అబ్బాయిలు స్వేచ్ఛగా జీవించే పక్షుల లాంటివారు.

వారిలో కనిపించే ఉత్సాహం, వారి స్నేహితులకి కూడా అలవాటు చేస్తారు.కాబట్టి మెన్ ఆర్ క్రేజీ బడ్డీస్.

* మీరే గమనించండి, ఎంత మంచి స్నేహితురాళ్ళైనా, చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టేసుకుంటారు.పెద్ద పెద్ద డైలాగులతో డ్రామా క్రియేట్ చేస్తారు.

అదే అబ్బాయి అయితే నాలుగు మాటలన్నా పడతాడు, కుదిరితే తిడతాడు కాని, సినిమా డైలాగులు మాట్లాడి డ్రామా క్రియేట్ చేయడు.

* ఒకవేళ మరో అమ్మాయి కొత్తరకం డ్రెస్ వేసుకుంది అనుకోండి, దాన్ని గొప్పగా చెప్పుకుంటుంది.

కొత్త నగ వేసుకుంది అనుకోండి .ఈర్ష్య పడేదాకా దాని గురించి చెబుతూనే ఉంటుంది.ఇలాంటి నస అబ్బాయిల దగ్గర ఉండదు.

* అబ్బాయిల దగ్గర గొప్పలకు పోవాల్సిన పని ఉండదు.మీరు సింపుల్‌గా ఉన్నా ఎవరు కామెంట్ చేయరు.ఇంత చీప్ మొబైల్ ఏంటి, ఆ డ్రెస్ ఎంతకు కొన్నావ్ లాంటి మాటలు అబ్బాయిల నోటినుంచి వినడం దాదాపు అసాధ్యం.

కాబట్టి మేల్ ఫ్రెండ్స్ తో అయితే నిరాడంబరంగా ఉండొచ్చు.

* అబ్బాయిలకి రోటీన్ గా ఉండటం ఇష్టం ఉండదు.

ఎప్పుడూ ఏదోకటి కొత్తగా చేస్తుంటారు.జీవితాన్ని వారు చూసే కోణంలో చాలా తక్కువమంది అమ్మాయిలు చూస్తారు.

ఒక అడ్వెంచరస్ లైఫ్ కావాలంటే, మేల్ ఫ్రెండ్స్ తో సమయం గడపడమే మంచి ఆప్షన్.

* అబ్బాయిలే బెస్ట్ ఫ్రెండ్స్ అయితే, సెక్యూరిటీకి కొదువ ఉండదు.

ఎక్కడికి వెళ్ళినా, ఓ నాలుగురు బాడిగార్డ్స్ ని వెనకేసుకోని వెళ్లినట్టే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube