అనంత‌పురం ప‌వ‌న్ పోటీపై నిర‌స‌న‌లు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను పోటీకి రెడీ అవుతున్నారు.ఓ వైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ కోసం ఎంపిక‌లు కూడా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 Protests Against Pawan Kalyan-TeluguStop.com

ఇదిలా ఉంటే ప‌వ‌న్ తాను ఎమ్మెల్యేగా ఏపీలోని అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.ప‌వ‌న్ అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని చెప్పినా ఆయ‌న జిల్లాలోని ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తాన‌న్న‌ది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు.

ప‌వ‌న్ అనంత‌పురం జిల్లాలోని అనంత‌పురం లేదా క‌దిరి నుంచి పోటీ చేస్తార‌ని ఊహాగానాలు వ‌స్తున్నాయి.ఇదిలా ఉంటే ప‌వ‌న్ ఇంకా పొలిటిక‌ల్‌గా పూర్తి స్థాయిలో వ‌ర్క్ స్టార్ట్ చేయకుండానే ఆయ‌న పోటీపై అప్పుడే విమ‌ర్శ‌లు స్టార్ట్ అయ్యాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాయలసీమలో ఎలా పోటీ చేస్తారని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

పాల‌కులంద‌రూ సీమ ప్ర‌జ‌ల‌ను వాడుకుని వ‌దిలేస్తున్నార‌ని…ఇప్పుడు ప‌వ‌న్ సైతం అదే బాట‌లో న‌డుస్తున్నార‌ని వెంక‌ట సుబ్బారెడ్డి విమ‌ర్శ‌లు చేశారు.

గతంలో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా తిరుప‌తి నుంచి గెలిచాక‌.పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశార‌న్న సంగ‌తి ఆయ‌న గుర్తు చేశారు.

ఇక సీమ నుంచి ఎందరో ముఖ్య‌మంత్రులు వ‌చ్చినా వారు సీమ‌కు చేసిందేమి లేద‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు.

ఇక ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబు సైతం సీమ‌పై స‌వ‌తి ప్రేమ చూపిస్తూ అమ‌రావ‌తి పేరుతో కోస్తాకే అంతా దోచేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

సీమ సమస్యలకు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే పరిష్కారమని, 11 జిల్లాల‌తో ప్ర‌త్యేక రాయ‌ల‌సీమ రాష్ట్రం ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోడీకి లేఖ రాసిన‌ట్టు కూడా ఆయ‌న తెలిపారు.ఏదేమైనా ప‌వ‌న్ సీమ నుంచి పోటీ చేయాల‌ని చూస్తుంటే అప్పుడే ప‌వ‌న్ పోటీపై నిర‌స‌న‌లు రేగ‌డం జ‌న‌సేన‌కు ఇబ్బందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube