విమానాశ్రయం వద్దే వద్దు

పాలకులు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం కంటే పెట్టుబడిదారులకు, కార్పొరట్లకు, బడా బాబులకు సౌకర్యాలు కల్పించడం మీదనే ఆసక్తి చూపిస్తున్నారు.ఎంతసేపటికీ వారిని సంతృప్తిపరచడానికే ప్రయత్నాలు చేస్తున్నారు.

 Protest Against Airport Construction In Vizianagaram-TeluguStop.com

ఇందుకోసం పేదలను బలిపశువులను చేస్తున్నారు.వారి పొట్టలు కొడుతున్నారు.

అందుకే వారు తిరగబడుతన్నారు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనబడుతోంది.

రాజధాని కోసం వేలాది ఎకరాల పచ్చటి పంట భూములను సేకరించిన ప్రభుత్వం పెద్ద విమనాశ్రయం కోసం భూములు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే ప్రజలు నిరసిస్తున్నారు.విజయనగరం జిల్లా బోగాపురం మండలంలో విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఈ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.కాని అక్కడి ప్రజలు మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.

విమానాశ్రయం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు తమ నిరసనలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు.తమ పంట భూములను నాశనం చేసుకునేందుకు సిద్ధంగా లేమని చెప్పారు.

మరి బాబు ప్రభత్వం వెనక్కి తగ్గుతుందా? బలవంతంగ భూమి సేకరిస్తుందా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube