బోయపాటి సినిమాకి కొత్త నిర్మాతలు వచ్చేసారు-Producers Changed For Boyapati’s Next 3 months

Bellamkonda Srinivas Boyapati Naga Chaitanya Producers Changed For Boyapati's Next Ravindra Reddy Sahasam Swasaga Saagipo Photo,Image,Pics-

బోయపాటి శ్రీను ఇప్పుడొక బ్రాండ్ డైరెక్టర్. దమ్ము తప్ప, కెరీర్లో పెద్దగా అపజయాలు చూడని బోయపాటి, ఈ ఏడాదిని సరైనోడు రూపంలో గొప్పగా ఆరంభించారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఏకంగా 70 కోట్లకు పైగా షేర్ రాబట్టి, తెలుగు సినిమా చరిత్రలోని, అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. దాంతో బోయపాటి డిమాండ్ మరింత పెరిగిపోయింది.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి ఒక సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మొదట అభిషేక్ పిక్చర్స్ నిర్మించాల్సింది. కాని ఎందుకో తెలియదు, ఇప్పుడు వారు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.

బహుషా బోయపాటి తోనే ఏదైనా ఇబ్బంది రావొచ్చు లేక హీరో తండ్రి అయిన బెల్లంకొండ సురేష్ తో ఏవైనా అభిప్రాయ తేడాలు వచ్చి ఉండవచ్చు అని ఫిలింనగర్ జనాలు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా, ఇప్పుడు వారు ఈ సినిమా చేయట్లేదు.

వారి స్థానంలో నాగచైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని నిర్మించిన రవింద్ర రెడ్డి ఇప్పుడు ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. రకుల్ ప్రీత్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభమవుతుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. అ హీరోతో పిల్లల్ని కన్నట్టు ఊహించుకునే దీపిక
ira

About This Post..బోయపాటి సినిమాకి కొత్త నిర్మాతలు వచ్చేసారు

This Post provides detail information about బోయపాటి సినిమాకి కొత్త నిర్మాతలు వచ్చేసారు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Producers changed for Boyapati's next, Boyapati Srinivas, Bellamkonda Srinivas, Abhishek Pictures, Ravindra Reddy, Naga Chaitanya, Sahasam Swasaga Saagipo

Tagged with:Producers changed for Boyapati's next, Boyapati Srinivas, Bellamkonda Srinivas, Abhishek Pictures, Ravindra Reddy, Naga Chaitanya, Sahasam Swasaga SaagipoAbhishek Pictures,bellamkonda srinivas,Boyapati Srinivas,naga chaitanya,Producers changed for Boyapati's next,Ravindra Reddy,Sahasam Swasaga Saagipo,,