నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ కన్నుమూత

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 30 సినిమాలను నిర్మించి ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత వి.బి.

 Producer Vb Rajendra Prasad Is No More-TeluguStop.com

రాజేంద్ర ప్రసాద్‌(82) నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు.గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజేంద్ర ప్రసాద్‌ ఇషా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

డాక్టర్లు చేసిన ప్రయత్నాలు అన్ని కూడా విఫలం అవ్వడంతో రాజేంద్ర ప్రసాద్‌ తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు.

రాజేంద్ర ప్రసాద్‌ గారికి ముగ్గురు కుమారులు.ఆ ముగ్గురిలో ఒకరే హీరో జగపతి బాబు.నాటకాలపై ఉన్న అభిమానంతో మొదటగా తన కెరీర్‌ను నటుడిగా రంగస్థలంపై ఆరంభించారు.

ఆ తర్వాత కొంత కాలానికి వెండి తెరపై నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నించారు.అయితే నటుడిగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, నిర్మాతల మొదట ‘అన్నపూర్ణ’ అనే సినిమాను నిర్మించాడు.

ఆ సినిమా సక్సెస్‌ అవ్వడంతో వరుసగా సినిమాలు నిర్మిస్తూ వచ్చాడు.అక్కినేని నాగేశ్వరరావుతో రాజేంద్ర ప్రసాద్‌ గారికి మంచి సన్నిహిత సంబంధం ఉంది.

ఆ సానిహిత్యం వల్లే వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి.ఆ సినిమాల్లో పలు విజయవంతం అయ్యాయి.

నాగేశ్వరరావు ప్రోత్బలంతో రాజేంద్రప్రసాద్‌ దర్శకుడిగా మారాడు.‘దసరా బుల్లోడు’ సినిమాతో నాగార్జునకు సుపర్‌ హిట్‌ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్‌.

ఈయన మరణంతో తెలుగు చిత్ర సీమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినంతగా బాధపడుతోంది.రాజేంద్ర ప్రసాద్‌ మరణం పట్ల సినీ ప్రముఖులు మరియు ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube