సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదు అంటున్న స్టార్ హీరోయిన్

స్టార్ కథానాయిక ప్రియాంక చోప్రా కెరీర్ తొలినాళ్ళలో అవకాశాలు సరిగా లేక సూసైడ్ చేసుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించిందని, ప్రతిసారి ఆమెని నేనే ఆపానని ప్రియాంక చోప్రా మాజీ మేనేజర్ ప్రకాష్ జాజు వాఖ్యానించిన సంగతి తెలిసిందే.అయితే ప్రకాష్ జాజు మాటలని మొదట ప్రియాంక తల్లి, ఇప్పుడు ప్రియాంక చోప్రా కొట్టిపడేశారు.తానెప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించలేదని స్పష్టం చేసింది ప్రియాంక.

 Priyanka Chopra Trashes Her Suicide Rumors-TeluguStop.com

” చాలా మూర్ఖపు వాఖ్యలు అవి.నన్ను వేధించి జైలుకి వెళ్ళిన వ్యక్తి మాటలను పట్టించుకున్న భారతీయ మీడియాకి నా సానుభూతి.ఏమాత్రం బాగాలేని గతం తనది.

తన మాటలను నమ్మాలని అనిపించిందా జనాలకి ? నేనెప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనుకోలేదు.నేను తనని జైలుకి పంపాను అన్న కసితోనే ఈ వాఖ్యలు చేసుంటాడు” అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.

ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో.కెరీర్ మొదట్లో తానూ ప్రియాంకకి చాలా సహాయపడ్డానని, తన వల్లే బాలివుడ్ లో నిలబడగలిగిందని , ప్రకాష్ జాజు అంటాడు.

మరి ప్రియాంక ఏమో తనని కూరలో కరివేపాకులా తీసిపడేస్తోంది.ఇద్దరి మధ్య గొడవేంటో, తన మేనేజర్ గా ఉన్నవాడ్ని ప్రియాంక జైలుకి ఎందుకు పంపించాల్సి వచ్చిందో ! రంగుల ప్రపంచంలో అంతా అయోమయం !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube