కన్నడ బ్యూటీ ప్రియమణి తెలుగు తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో నటించేసింది.ఈ మధ్య కాలంలో చాన్స్ లు క్లోజ్ కూడా అయిపోయాయి ఆమెకి.
ఆ మధ్య బాలీవుడ్ లో ఎదో పొడుస్తా అంటూ వెళ్లి సరైన హిట్ ఒక్కటీ లేక వెనక్కి వచ్చేసింది.చేతిలో డజన్ల కొద్దీ ఆఫర్ లు ఉన్న రోజులు గడిపిన రికార్డ్ ప్రియమణి సొంతం.
మలయాళం సినిమాలలో ఛాన్స్ ల కోసం ఆమె ప్రస్తుతం ఎదురు చూస్తోంది.ఓ డ్యాన్స్ రియాలిటీ షోకి జ్యూరీ మెంబర్ గా ఉంటూ.కేరళ జనాలకు టచ్ లోనే ఉంటోంది ప్రియమణి.ఆసిఫ్ ఆలీ తో ఒక మలయాళ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా ఆమె ఫిబ్రవరి నుంచీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
త్వరలో తమిళం లో ఒక డాన్స్ రియాలిటీ షో లో జడ్జీ గా నటించడానికి ఒప్పుకుందట.ఈమె చాలా అప్పుల్లో కూరుకుపోయిందని అందుకే మళ్లీ సినిమాలు చేస్తున్నట్లుగా వస్తున్న రూమర్స్ పై కూడా స్పందించింది.
ప్రియమణికి సహాయం చేసేందుకు కన్నడ మూవీలో ప్రకాష్ రాజ్ ఆఫర్ ఇచ్చాడన్నది ఓ రూమర్స్ సారాంశం.” ప్రతీ రోజూ నాకు ప్రొడ్యూసర్ ల దగ్గర నుంచే ఆఫర్ ల కోసం కాల్స్ వస్తూనే ఉన్నాయి, స్టోరీ లు వినమని అడుగుతున్నారు కానీ నాకు ఖాళీ ఉండడం లేదు ” అంటోంది .సబ్జెక్ట్ లు కూడా సరిగ్గా ఉండడం లేదు అనీ ఏదైనా థ్రిల్లింగ్ స్టోరీ కావాలి అనేది ఆమె వాదన.నేనింకా బరిలో నే ఉన్నాను అని చెప్పడానికి ఈ కహానీలు చెబుతున్నా ఆమె నిండా అప్పుల్లో కూరుకుపోయింది అనీ వాటిని తీర్చడం కోసమే అడ్డవైన షో లూ ఒప్పుకుంటోంది అని ఒక వర్గం ఆరోపిస్తోం
.