మహేష్‌బాబు ప్లేబాయ్‌ అంటా..!

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాలో మహేష్‌బాబు ఒక మల్టీ మిలియనీర్‌ కుమారుడిగా కనిపించనున్నాడు.

 Mahesh Babu As A Play Boy-TeluguStop.com

ఇప్పటి ఈ విషయంను అధికారికంగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది.డబ్బు ఉన్న అహంకారంతో తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే పాత్రలో మహేష్‌బాబు నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్లేబాయ్‌ పాత్రలో మహేష్‌బాబు గతంలో కనిపించింది లేదు.అయితే ఈసారి మాత్రం కొత్తగా స్టైలిష్‌లుక్‌లో అమ్మాయిలను ఆకట్టుకునే ప్లేబాయ్‌గా కనిపించనున్నాడు.

ఇప్పటి వరకు ఫ్యామిలీ పాత్రలు, పద్దతైన పాత్రలు చేస్తూ వస్తున్న మహేష్‌బాబు ఉన్నట్లుండి ఇలాంటి పాత్రను చేయడం అందరిని ఆశ్చర్యపర్చే విషయం.అయితే కొత్తదనం కోసం మహేష్‌బాబు ఈ పాత్రను ట్రై చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ పాత్రలో కాస్త నెగటివ్‌ షేడ్స్‌ కూడా ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఇటీవలే ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ సినిమాలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేసి మెప్పించాడు.

త్వరలో మహేష్‌బాబు కూడా తనలోని నెగటివ్‌ షేడ్స్‌ను, ప్లేబాయ్‌ లక్షణాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడున అన్న మాట.ఈ సినిమాలో మహేష్‌కు జతగా శృతిహాసన్‌ నటిస్తోంది.మే మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube