నమో వెంకటేశా...నమో తిరుమలేశా

రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.దక్షిణాది విడిది కోసం సోమవారం హైదరాబాదుకు చేరుకున్న రాష్ర్టపతి మంగళవారం ఉమ్మడి రాష్ర్ట గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన విందుకు హాజరయ్యారు.

 Pranab Visits Lord Venkateswara Temple In Tirupati-TeluguStop.com

ఈ రోజు ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు.ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలు వారు తెలంగాణకు వచ్చినా, ఆంధ్రాకు వచ్చినా వెంకన్న దర్శనం చేసుకోనిదే తిరిగి వెళ్లరు.

రాష్ర్టపతి వెంట గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా రాష్ర్టపతి వెంట వస్తారని గతంలో వార్తలు వచ్చినా, గవర్నర్‌ ఇచ్చిన విందుకే హాజరుకాని ఆయన తిరుమలకు వస్తారా? జ్వరమొచ్చిందని విందుకు హాజరు కాలేదు.రాష్ర్టపతి వెంట వచ్చినట్లయితే అది నిజం జ్వరం కాదనే అభిప్రాయం జనానికి కలుగుతుంది.విందుకు వెళితే చంద్రబాబును కలుకోవల్సివస్తుందని, అలా కలుసుకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయనే భయంతో కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు రాలేదని వార్తలు వచ్చాయి.

అలాంటప్పుడు తిరుమలలోనూ బాబు ఎదురుపడతారు కదా…! అందుకే మానేశారు.తిరుమల వెళ్లడానికి ముందు రాష్ర్టపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.వెంకన్నను దర్శించుకునే ముందు అనేక దేవాలయాలను ఆయన సందర్శించారు.ఆయన రాష్ర్టపతి అయ్యాక తిరుమలకు వెళ్లడం ఇది రెండోసారి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube