ముందు దేవుడు...తర్వాతే మిగతావి..!

ముందు దేవుడిని దర్శించుకోవాలి…తర్వాతే మిగతా పనులు చేయాలి.ఇది భారతీయుల తత్వం.

 President Pranab Mukherjee To Visit Tirumala Tomorrow-TeluguStop.com

ఇందుకు సామాన్యుడే కాదు, రాష్ర్టపతి కూడా అతీతుడు కాడు.భగవంతుడిపై నమ్మకం ఉన్నవారికే ఇది వర్తిస్తుంది.

ఉదయం లేవగానే ముందు దేవుడికి దండం పెట్టో, పూజ చేసో మిగతా కార్యక్రమాలు చేసేవారు అనేకమంది ఉన్నారు.ఇదొక సెంటిమెంటు.

ఇందుకు బీద, గొప్ప అనే భేదం లేదు.మన రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా దక్షిణాది విడిది సందర్భంగా సోమవారం హైదరాబాదుకు చేరుకున్నారు.

వెంటనే బుధవారమే తిరుమల వెంకన్నను దర్శించుకునే పని పెట్టుకున్నారు.ఆయన పది రోజుల విడిదిలో మొదటి కార్యక్రమం ఇదే.ఈసారి ఆయన పర్యటనకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే రాష్ర్ట విభజన తరువాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌కు వెళుతున్నారు.ఆయన వెంట గవర్నర్‌ వెళ్లడం ప్రొటోకాల్‌ కూడా.

గవర్నర్‌ నరసింహన్‌ మొన్నీమధ్యనే తిరుమల వెళ్లి వెంకన్నకు తల నీలాలు సమర్పించి వచ్చారు.రాష్ర్టపతి తిరుమల పర్యటనలో మరో ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన వెంట వెళతారట…! ఇద్దరు చంద్రుల మధ్య ఉప్పు-నిప్పు పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేసీఆర్‌ తిరుమల వెళ్లడం విశేషంగానే చెప్పుకోవాలి.

రేవంత్‌ రెడ్డి కేసులో ఏపీ సీఎం చంద్రబాబును దోషిగా నిరూపించాలని, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తాను ఇరుక్కోకూడదని కోరుకుంటారేమో.తిరుమలకు రాష్ర్టపతి వస్తే ఏపీ సీఎంగా బాబు కూడా ఉండాలి కదా…! కాబట్టి ఆయన వెళతారు.

ఏడు కొండలవాడిని ఎవరెవరు ఏం కోరికలు కోరుకుంటారో మరి….!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube