గజిని లాంటి కథతో ప్రేమం డైరక్టర్..!

ప్రేమంతో ఈ దసరా రేసులో విక్టరీ సాధించిన దర్శకుడు చందు మొండేటి ఇదో రీమేక్ సినిమా అనే భావన ఎక్కడ కనపడకుండా చేశాడు.ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే వరుణ్ తేజ్ తో కథా చర్చల్లో పాల్గొన్న చందు ఆ సినిమా కన్ఫాం చేసుకున్నాడు.

 Premam Director Ghajini Story For Varun Tej-TeluguStop.com

ఐడ్రీం మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా గజిని లాంటి షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ తో ఉంటుందట.వరుణ్ తేజ్ కు కథ చెప్పిన వెంటనే కనెక్ట్ అవడంతో ఓకే అనేశాడట.

కథ ఇంచు మించు గజిని లాంటి కథే అయినా అది గజిని ఫీల్ తీసుకురాకుండా సరికొత్త స్క్రీన్ ప్లే రాసుకుంటున్నాడట.మొదటి సినిమా కార్తికేయతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న చందు ప్రేమంతో ప్రతి ఒక్కరి మనసులను గెలిచాడు.

మరి వరుణ్ తేజ్ తో తీయబోయే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.ఇక వరుణ్ సినిమా తర్వాత కింగ్ నాగార్జునకు కూడా సరిపోయే ఓ పవర్ ఫుల్ పోలీస్ కథ సిద్ధం చేశాడట చందు.

నాగ్ కూడా చందుతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube