బాహుబలి 2 మొదటిరోజు టికేట్స్ ఇప్పుడే బుక్ చేసుకోవాలా? అయితే ఇది ఫాలో అవండి

మరో రెండు వారాల్లో భారత దేశపు బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ మళ్ళీ ప్రేక్షకులని అలరించడానికి వస్తోంది.బాహుబలి 2 ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించనుంది.

 Pre Book Baahubali Ticket Following These Steps-TeluguStop.com

అయితే ఆ సినిమా టికేట్ల కోసం వేడి ఇప్పటినుంచే మొదలైంది.అసలు మొదటిరోజు టికెట్లు ఎట్లా పట్టాలి, ఎక్కడ పట్టాలి అని తలబద్దలు కొట్టుకుంటున్నారు జనాలు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.అంతెందుకు, ఆస్ట్రేలియాలో ఇప్పటికే బుకింగ్ స్టార్ట్ చేసారు.

అక్కడ కూడా టికెట్ ముక్క అందుబాటులో ఉండట్లేదు.రెండుమూడు వారాల ముందు ఆస్ట్రేలియాలో ఈ పరిస్థితి ఉంటే, మనకి మొదటిరోజు టికేట్స్ ఎలా దొరుకుతాయి అనుకుంటున్నారు ? అందుకే Bookmyshow.com ఒక కొత్త ఆలోచనతో వచ్చింది.అదే Pre Booking.

ఇప్పుడే బాహుబలి 2 టికెట్లు ప్రీబుకింగ్ చేసుకోవచ్చు.ఎలానో చెప్తాం చూడండి.మీకు ఆల్రెడి BookMyShow నుంచి మేయిల్ వస్తే అక్కడే ఫాలో అయిపోయిండి.ఈ మేయిల్ కేవలం బుక్ మై షో అకౌంట్ ఉన్నవారికే వస్తుంది.ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోని ఈ లింక్ లోకి వెళ్ళండి.

అకౌంట్ ఉండి మెయిల్ రాకపోయినా ఇదే లింక్ ఫాలో అవండి.

మొదట మీ డిటేల్స్ చూసుకోని మీరు ఉండే సిటిని సెలెక్ట్ చేసుకోవాలి.

అలాగే ఏ భాషలో బాహుబలి 2 చూడాలనుకుంటున్నారో సెట్ చేసుకోవాలి.ఆ తరువాత తేది, సమయం సెట్ చేసుకోవాలి.

ఇప్పుడు మీరు 3 థియేటర్లు సెలెక్ట్ చేసుకోవాలి.ఈ మూడు థీయేటర్లలోనే ఏదో ఒక థియేటర్లో మీకు టికేట్స్ దొరికే అవకాశం ఉంటుంది.

ఆ తరువాతి పేజీలో ఎన్ని టికేట్స్ కావాలో, ధర ఏ రేంజ్ లో ఉండాలో సెట్ చేసుకోని, పేమెంట్ చేయాలి.

Bookmyshow ప్రి బుకింగ్ చేసుకున్నవారికి టికేట్స్ ఇచ్చేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తుంది.

ఒకవేళ ప్రి బుకింగ్స్ లిమిట్ దాటి మీకు టికేట్ ఇవ్వలేకపోతే, మీరు కట్టిన డబ్బుని మీకు రీఫండ్ చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube