ఎర్ర‌న్న కోట‌లో పీకే స‌ర్వే ఏం చెప్పింది

ఏపీలో అధికార టీడీపీని నిలువ‌రించి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు వైసీపీ వేస్తోన్న స్కెచ్‌లు, చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌కు అంతేలేదు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేందుకు టీడీపీ ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ప‌థ‌కాల‌తో దూసుకుపోతుంటే వైసీపీ ఎన్నిక‌ల వ్యూహాల‌పైనే ప్ర‌ధానంగా ఆధార‌ప‌డ‌నుంది.

 Prashanth Kishore Survey On Ysrcp-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాదిలో ప‌లు ఎన్నిక‌ల్లో వ్యూహ‌క‌ర్త‌గా స‌క్సెస్ అయిన ప్ర‌శాంత్ కిషోర్‌ను జ‌గ‌న్ త‌మ పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్నారు.

ప్ర‌శాంత్ కిషోర్ ఏపీలో జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు ఇప్పటికే త‌న వ్యూహాలు ర‌చిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పీకే టీం స‌ర్వే కూడా స్టార్ట్ చేసింది.ఇదిలా ఉంటే టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాలో పీకే టీం స‌ర్వే జ‌రుగుతోంది.

పీకే టీం స‌భ్యులు జిల్లాలో వైసీపీ నేతలతో పాటు సాధారణ కార్యకర్తలనూ కలిశారు.ఈ సందర్భంగా పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలతో పాటుగా అధికార పార్టీలో నెలకొన్న అసంతృప్త అంశాల గురించి కూడా ఆరా తీస్తోన్న‌ట్టు తెలుస్తోంది.

జిల్లాలో ఇప్ప‌ట‌కీ టీడీపీ బ‌లంగానే ఉన్న‌ట్టు పీకే ప్రాథ‌మిక స‌ర్వేలో తేలిన‌ట్టు తెలుస్తోంది.ఇక జిల్లాలో 37 మంది వైసీపీ స‌ర్పంచ్‌లు పార్టీ వీడి టీడీపీలో ఎందుకు చేరార‌న్న‌దానిపై కూడా వీరు కూలంక‌షంగా ఆరా తీశారు.

ఇక మంత్రి అచ్చెన్నాయుడు నియోజ‌క‌వ‌ర్గం అయిన టెక్క‌లిలో వైసీపీ వీక్‌గా ఉండ‌డానికి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ దువ్వాడ శ్రీనివాసే కార‌ణ‌మ‌ని తేలింద‌ట‌.

దువ్వాడ నాయ‌క‌త్వంపై వైసీపీ నాయ‌కులే చాలా మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని తేలింద‌ట‌.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి ముగ్గురు అభ్య‌ర్థుల‌ను పీకే టీం సెల‌క్ట్ చేసింద‌ట‌.కులాల ఈక్వేష‌న్ల‌ను కూడా పీకే టీం పాటిస్తోన్న‌ట్టు తెలుస్తోంది.

ఏదేమైనా పీకే స‌ర్వేతో వైసీపీ నాయ‌కుల‌కు కంటిమీద కునుకు ఉండ‌డం లేద‌ట‌.ఓవ‌రాల్‌గా టీడీపీ కంచుకోట శ్రీకాకుళం జిల్లాలో పీకే టీం సర్వేలో ఇప్ప‌ట‌కీ ఆ పార్టీకే మొగ్గు ఉంద‌ని తేలిన‌ట్టు స‌మాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube