ఈయన మరో ప్రకాష్‌ రాజ్‌!!

టాలీవుడ్‌లో ప్రకాష్‌ రాజ్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ఈయన విలన్‌గా నటించిన ఎన్నో చిత్రాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.

 Prakash Raj Replaced By Rao Ramesh-TeluguStop.com

పలు ఫ్లాప్‌ చిత్రాల్లో ఈయన పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది.దాంతో టాలీవుడ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌గా, మోస్ట్‌ వాంటెడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రకాష్‌ రాజ్‌ పేరు తెచ్చుకున్నాడు.

అయితే నటుడిగా మంచి పేరు అయితే ఉంది కాని, ఈయనకు వ్యక్తిగా మాత్రం విమర్శలు ఉన్నాయి.ఈయన ఒప్పుకున్న సినిమాను పూర్తి చేసేందుకు చాలా సమయం తీసుకుంటాడు అని, ఇచ్చిన డేట్లలో షూటింగ్‌కు హాజరు కాడు అనే అపవాదులు ఉన్నాయి.

తాజాగా రానా హీరోగా తెరకెక్కబోతున్న ఒక సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ను ముఖ్య పాత్రకు ఎంపిక చేయడం జరిగింది.మొదట ప్రకాష్‌ రాజ్‌ సైతం ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది.

కాని ఆ తర్వాత ఈయన కొన్ని కారణాలు చెబుతూ సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు.దాంతో ప్రకాష్‌ రాజ్‌ లోటును ఎవరితో పూడ్చాలా అని భావిస్తున్న రానా అండ్‌ టీంకు రావు రమేష్‌ కనిపించాడు.

గత కొంత కాలంగా విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రావు రమేష్‌ సక్సెస్‌లను అందుకుంటూ దూసుకు పోతున్నాడు.దాంతో ప్రకాష్‌ రాజ్‌ ప్లేస్‌ను బర్తీ చేయడం రావు రమేష్‌కే సాధ్యం అని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు.

అందుకే ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ను ఎంపిక చేయడం జరిగింది.ఇంకా పలు సినిమాల్లో సైతం ప్రకాష్‌ రాజ్‌తో నటింపజేయాలనుకున్న పాత్రలను రావు రమేష్‌తో చేయిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube