ప్రకాష్ రాజ్ కి పోటీ ఎవరు ఉన్నారు?

తెలుగు సినీ పరిశ్రమలో కామెడి, విలన్,క్యారెక్టర్ పాత్రలకు కోట శ్రీనివాసరావు పెట్టింది పేరు.ఆ తర్వాత కోటకు చెక్ పెడుతూ ప్రకాష్ రాజ్ వచ్చాడు.

 Prakash Raj Fading Out In Tollywood?-TeluguStop.com

ప్రకాష్ రాజ్ అన్ని రకాల పాత్రలలో పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్నవాడు.ప్రకాష్ రాజ్ తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.

సినీ పరిశ్రమలోకి చాలా మంది వస్తూ ఉంటారు….పోతూ ఉంటారు.

అలాగే ఈ మధ్య కాలంలో ప్రకాష్ రాజ్ డిమాండ్ తగ్గిందనే చెప్పాలి.

ప్రకాష్ రాజ్ డిమాండ్ తగ్గటానికి కొత్త నటులు రావటం మరియు అయన చేసుకున్న స్వయం కృతాపరాధం కూడా ఉంది.

ప్రస్తుతం రావుగోపాల రావు కొడుకు రావు రమేష్ ప్రకాష్ రాజ్ కి బదులుగా చాలా సినిమాల్లో నటిస్తున్నాడు.రావు రమేష్ మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసినా నిదానంగా పుంజుకొని సపోర్ట్ పాత్రలు, విలన్ పాత్రలను చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నాడు.

అలాగే తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నాడు.ఒకప్పుడు తండ్రి పాత్ర అంటే ప్రకాష్ రాజ్ గుర్తుకువచ్చేవాడు.

కానీ ఇప్పుడు దర్శక, నిర్మాతలకు రావు రమేష్ గుర్తుకు వస్తున్నాడు.అటువంటి ప్రకాష్ రాజ్,రావు రమేష్ ఇద్దరూ ఒకే సినిమాలో పోటాపోటీగా నటించారు.

త్వరలో రాబోతున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో నువ్వా నేనా అన్నట్టు నటించారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube