యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.‘మిర్చి’ చిత్రం విడుదలైన దగ్గర నుండి కూడా ‘బాహుబలి’ కోసమే ప్రభాస్ పని చేస్తూ ఉన్నాడు.
దాదాపు రెండు సంవత్సరాలుగా ‘బాహుబలి’ సినిమా కోసం కష్టపడ్డ ప్రభాస్ త్వరలో మరో సినిమాలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.‘బాహుబలి’ మొదటి పార్ట్ షూటింగ్ పూర్తి అయ్యింది.
రెండవ పార్ట్‌కు కొంత సమయం పట్టనుంది.ఈ నేపథ్యంలో ఈ యంగ్ రెబల్ స్టార్ ఒక సినిమాలో నటించనున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
ప్రభాస్ స్నేహితులు వంశీ మరియు ప్రమోద్‌లు ఆ సినిమాను నిర్మించనున్నారు.ఇప్పటికే వీరు ప్రభాస్ కోసం పలు కథలు సిద్దం చేయించారు.
అయితే ప్రభాస్‌కు మాత్రం పోలీస్ నేపథ్యంలోని కథలో నటించాలనే కోరికతో ఉన్నాడట.టాలీవుడ్లో స్టార్ హీరోలు అంతా కూడా ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి, సక్సెస్‌లు కొట్టారు.
కొందరు ఫెయిల్ అయినా కూడా ఎక్కువ శాతం సక్సెస్ ఉంది.దాంతో ప్రభాస్ తన తర్వాత సినిమాలో పోలీస్‌గా నటించాలని కోరుకుంటున్నాడు.