ప్రభాస్‌ పెళ్లి కబురు

ప్రభాస్‌ పెళ్లి గురించి గత మూడు సంవత్సరాలుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న విషయం తెల్సిందే.‘బాహుబలి’ సినిమా విడుదల అయిన తర్వాత ప్రభాస్‌ పెళ్లి ఉంటుందని అంతా అనుకున్నారు.

 Prabhas To Get Married This Year-TeluguStop.com

ఒకటి రెండు సార్లు ప్రభాస్‌ కూడా అదే విషయాన్ని చెప్పాడు.అయితే ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు అయ్యింది.

మొదటి పార్ట్‌ విడుదల అయిన తర్వాత ప్రభాస్‌ పెళ్లి ఉంటుందని అంతా అనుకున్నారు.కాని మొదటి పార్ట్‌ తర్వాత ఇప్పుడు రెండవ పార్ట్‌ పనిలో ప్రభాస్‌ బిజీగా ఉన్నాడు.

గత కొంత కాలంగా సస్పెన్స్‌గా ఉన్న ప్రభాస్‌ పెళ్లిపై ఒక క్లారిటీ వచ్చింది.

తాజాగా రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభాస్‌ పెళ్లిపై ఒక అధికారిక ప్రకటన చేశాడు.

తాను కూడా ఎంతో ఆసక్తిగా ప్రభాస్‌ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాను అని, ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడెప్పుడు చేయాలని అని మా కుటుంబం అంతా కూడా ఎదురు చూస్తున్నాం అని కృష్ణం రాజు చెప్పుకొచ్చాడు.మొదట ‘బాహుబలి’ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన ప్రభాస్‌ మళ్లీ ఇప్పుడు ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ అంటూ బిజీగా ఉన్నాడు.

దాంతో తాజాగా సంక్రాంతి రోజు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటూ నిలదీశాను.దాంతో ఈ సంవత్సరం ఖచ్చితంగా చేసుకుంటాను అని నాకు మాట ఇచ్చాడు అని కృష్ణం రాజు చెప్పాడు.

దాంతో ప్రభాస్‌ పెళ్లి ఈ సంవత్సరంలోనే అని ఖరారు అయ్యింది.ఎప్పుడు, ఎవరితో, ఎక్కడ అనేది త్వరలోనే తేలనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube