ప్రభాస్ కోసం అంత పెడుతున్నారు..!-Prabhas Statue Shocking Investment 3 months

 Photo,Image,Pics-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో దేశమంతా హాట్ టాపిక్ అయ్యాడు. దాదాపు బాలీవుడ్ హీరోతో సమానమైన క్రేజ్ సంపాదించిన ప్రభాస్ కు ఏ దక్షిణాది హీరో పొందలేని అరుదైన గౌరవం మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో తన స్టాట్యూ పెట్టే కార్యక్రమాలు జరుగడం. ఇప్పటికే దీనికి సంబందించిన ప్రభాస్ కొలతలు అన్ని తీసుకోవడం జరిగింది. అయితే బ్యాంకాక్ లో ఏర్పాటు చేసే ఈ స్టాట్యూకి ఏకంగా 50 వేల పౌండ్స్ ఖర్చు చేస్తున్నారట మ్యూజియం వాళ్లు.

మన కరెన్సీలో చెప్పాలంటే అది దాదాపు కోటిన్నర అవుతుంది. అంత భారీ ఖర్చుతో ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టబోతున్నారట. ఇదవరకు ఇలాంటి స్టాట్యూలు పెట్టినా వాటికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది బయట పడలేదు కాని ప్రభాస్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఆరా తీయగా ఆ స్టాట్యూ కోసం ఏకంగా అంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారట. మరి ఇదో రకంగా దక్షిణాది నటుడిగా ప్రభాస్ పొందిన ఓ గొప్ప సత్కారం అని చెప్పాలి. మొదటి పార్ట్ తోనే సంచలనాలను క్రియేట్ చేసిన ఈ బాహుబలి అసలైన రెండో పార్ట్ రిలీజ్ అయ్యాక ఇంకెన్ని ఇలాంటి గొప్ప సత్కారాలు అందుకుంటాడో చూడాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మహేష్ చేసేదంతా పబ్లిసిటి కోసమే అంటున్న పవన్ ఫ్యాన్స్

About This Post..ప్రభాస్ కోసం అంత పెడుతున్నారు..!

This Post provides detail information about ప్రభాస్ కోసం అంత పెడుతున్నారు..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Prabhas wax statue, Rs 1.5 crore Investment, Madame Tussauds, Bangkok, Bahubali, first South Indian actor, ప్రభాస్ కోసం అంత పెడుతున్నారు..!

Tagged with:Prabhas wax statue, Rs 1.5 crore Investment, Madame Tussauds, Bangkok, Bahubali, first South Indian actor, ప్రభాస్ కోసం అంత పెడుతున్నారు..!,Allu Arjun New Movie Ratham Movie Photos