బాహుబలి 2 ది కంక్లూజన్ ఇండియా వరకు అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.రాజమౌళి డైరెక్షన్ కి ఫుల్ మార్కులు పడ్డాయి, ప్రభాస్ నటనకి ఫుల్ మార్కులు పడ్డాయి, రానా విలనిజంకి ఫుల్ మార్కులు పడ్డాయి, అనుష్క అభినయానికి ఫుల్ మర్కులు పట్డాయి, కాని స్వీటి షేప్ కి మాత్రం నెగటివ్ మార్కులు పడ్డాయి.
కొన్ని సీన్లలో ఫిట్ గా కనిపించిన అనుష్క, కొన్ని సీన్లలో మాత్రం లావుగా కనిపించింది.
అందులో అనుష్క తప్పు పెద్దగా లేదు.
సైజ్ జీరో కోసం పెంచిన బరువు బాహుబలి 2 కోసం కఠోర శ్రమతో తగ్గించుకుంది.కాని పాపం స్వీటి మోకాలికి అప్పుడే దెబ్బ తగలడం, ఆ తరువాత బెడ్ రెస్ట్, మోకాలి గాయంతో తాను వ్యాయామం చేసే పరిస్థితి లేకపోవడంతో మళ్ళీ లావెక్కింది.
అనుష్క గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.తను మళ్ళీ జిమ్ లోకి అడుగుపెట్టి సైజ్ తగ్గాలంటే కొంత సమయం కావాలి.
అందుకే ప్రభాస్ “సాహో” లో అనుష్క పేరు పరిశీలిస్తున్నా, ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట.
మరోవైపు మంజిమా మోహన్ (సాహసం శ్వాసగా సాగిపో ఫేమ్) కూడా సీన్లోకి ఎంటర్ అయ్యింది.
ప్రభాస్ కి జోడిగా ఈ అమ్మడి పేరు కూడా పరిశీలిస్తున్నారు.కాని ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్.
మంజిమా కూడా లావుగానే ఉంది.తనకు ఎలాంటి గాయం కాలేదు కాని ఈ సినిమాలో సెలెక్ట్ కావాలంటే తాను చెమట చిందించి బరువు తగ్గాల్సిందే.
ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేసారట.బరువు తగ్గితేనే అవకాశం, లేదంటే లేదు.
అలాగే ఎంతో కొంత స్కిన్ షో చేయాలి.ఇవే మంజిమా ముందు పెట్టిన కండీషన్స్.
మరోవైపు ప్రభాస్ మాత్రం పూజ హెగ్డే వైపే ఓటు వేస్తున్నాడట.ఈ అమ్మాయి ఆరోగ్యంగా, మంచి షేప్ లో ఉంది, పైగా స్కిన్ షోలో ఎలాంటి లిమిట్స్ పెట్టుకోదు.
అందుకే అనుష్క, మంజిమాల పక్కనపెట్టి, పూజనే ఎంచుకునే అలోచన చేయండి, సమయం వృధాగా పోదు అంటూ ప్రభాస్ అమెరికా నుంచి సాహో యూనిట్ కి కబురు పంపాడట.