టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సినిమాలో నటించిన ప్రభాస్‌కు ఒక్కసారిగా బాలీవుడ్ హీరోను మించిన క్రేజ్ వచ్చింది.
దాంతో గతంలో ప్రభాస్ నటించిన తెలుగు సినిమాలు ఒక్కటొక్కటిగా తమిళం, మలయాళం, హిందీల్లో డబ్బింగ్ అవుతున్నాయి.ఇప్పటికే పలు సినిమాలు డబ్బింగ్ అవ్వగా, తాజాగా డిజాస్టర్ అయిన ‘రెబల్’ చిత్రం కూడా డబ్బింగ్ అయ్యి తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్దం అవుతోంది.
లారెన్స్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘రెబల్’ చిత్రం సంచలన ఫలితాన్ని సాధించనుందని భావించగా, షాకింగ్ ఫలితాన్ని నిర్మాతలకు ఇచ్చింది.బడ్జెట్ పరిమితి దాటడంతో పాటు, ఎక్కువ స్థాయి యాక్షన్ అవ్వడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని జీర్ణించుకోలేక పోయారు.
ఇప్పుడు ఆ సినిమాను తమిళ ఆడియన్స్ ముందుకు తీసుకు వెళ్లేందుకు లారెన్స్ డబ్బింగ్ వర్క్ చేస్తున్నాడు.‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌కు మంచి పేరు రావడంతో ఈ సినిమాకు ‘వీరబలి’ అనే టైటిల్‌ను పెట్టి విడుదల చేయబోతున్నాడు.
‘వీరబలి’ ప్రమోషన్లో ఎక్కువగా ‘బాహుబలి’ పేరును వాడుకునేందుకు నిర్మాతల వద్ద అనుమతి కూడా తీసుకోవాలని లారెన్స్ భావిస్తున్నాడు.‘బాహుబలి’ క్రేజ్‌తో ‘రెబల్’కు ఏమైనా కలెక్షన్స్ వచ్చేనో చూడాలి.