కండలు పెంచడం లో బిజీ గా ప్రభాస్

బాహుబలి 1 – దేశ సినిమా చరిత్ర ని తిరగ రాసిన చిత్రం ఇది.భారత దేశం లోనే బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా రూపుదిద్దుకున్న బాహుబలి దేశ సినిమా ఖ్యాతి ని ఖండాంతరాలకి వ్యాపింప జేసింది.

 Prabhas Putting Up Some Mass-TeluguStop.com

రాజమౌళి అద్భుత సృష్టిగా రూపొందిన బాహుబలి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా చాలా పెద్ద రికార్డులు సృష్టించింది.సౌత్ ఇండియా లో నెంబర్ వన్ సినిమాగా నిలిచింది బాహుబలి ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ లో యావత్ చిత్ర బృందం బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.

మొదట్లో ఈ సినిమా కోసం కత్తి యుద్ధాలూ, గుర్రపు స్వారీలూ చేసిన ప్రభాస్ ఇప్పుడు దేహ ధారుడ్యాన్ని కూడా పెంచే పనిలో పడ్డాడు.రీసెంట్ గా సినిమాలోని ఓ వార్ సీక్వెన్స్ కోసం ఇంకా కండలు తిరిగిన దేహాన్ని పెంచమన్నాడట.

దాంతో ప్రభాస్ ప్రస్తుతం ఇంకా స్పెషల్ డైట్ తీసుకుంటూ డిఫరెంట్ జిమ్ టెక్నిక్స్ ఫాలో అవుతూ తన బాడీని ఇంకా పెంచుతున్నాడు.‘బాహుబలి – ది బిగెనింగ్’ కంటే పదింతలు బెటర్ గా ‘బాహుబలి – ది కంక్లూజన్’ ఉండాలని ఈ చిత్ర టీం అంతా ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాకి పనిచేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube