ప్రభాస్ ఖాన్ త్రయం కంటే పెద్ద స్టార్ అయిపోయాడట

రామోజి ఫిలింసిటిని సినిమా షూటింగ్ కోసం వాడుకోవటం చూసాం కాని, తొలిసారి ఓ సినిమా ఫంక్షన్ ని పెట్టేసాడు రాజమౌళి.ఎక్కడైతే బాహుబలి తన సినిమా షూటింగ్ అంతా జరుపుకుందో, అదే గడ్డ మీద బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.

 Prabhas Is Bigger Star Than Khans-TeluguStop.com

బాహుబలి అభిమానులు, సినీపెద్దలు, బాలివుడ్ ప్రముఖులు హాజరవగా, అంగరంగవైభవంగా జరిగిన బాహుబలి 2 ఫంక్షన్ చూపరులని విపరీతంగా ఆకట్టుకుంది.రాజమౌళి మీద కీరవాణి కట్టిన ఓ పాట, ఆ పాట వింటూ రాజమౌళి కన్నీళ్లు పెట్టుకోవడం, మొత్తం ఫంక్షన్ కి హైలెట్ విషయం.

ఇక బాలివుడ్ మీడియాని మాత్రం ఎవరు ఊహించినట్టుగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఆకర్షించాడు.అందుకు కారణం ఆ టెక్నిషియన్ ఇచ్చిన స్టేట్మెంటే.

“ఇండియాలో ఇప్పుడు ప్రభాస్ నెం.1, ఖాన్ల కంటే కూడా పెద్ద హీరో.అతని సినిమా భారతీయ సినీచరిత్రలో మొట్టమొదటి 1000 కోట్ల వసూళ్ళ సినిమా కాబోతోంది” అంటూ అభిప్రాయపడ్డాడు సెంథిల్.బాహుబలి 1000 కోట్లు సాధించబోతుండవచ్చు, బాహుబలి ఖాన్ త్రయం రికార్డులు కూడా బద్దలుకొట్టబోతుండవచ్చు, అంతమాత్రాన మన ప్రభాస్, బాలివుడ్ దిగ్గజాలైన ఆమీర్, సల్మాన్, షారుఖ్ లని దాటేసినట్టా?

ఇలాంటి వ్యాఖ్యలు ప్రభాస్ ని పొగిడినట్టుగా అనిపించవచ్చు కాని, ఇవి ప్రభాస్ మీద ఒత్తిడి పెంచేవే.బాహుబలి సీరీస్ వలన ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు, అభిమానులు రెట్టింపు అయ్యారు, మార్కేట్ పెరిగింది కాని ఖాన్స్ ని మించిపోయాడు అనడం టూ మచ్ ఏమో కదా.ఎందుకంటే ఎటువంటి గ్రాఫిక్స్, భారి హంగులు, రాజమౌళి లాంటి బ్రాండ్ లేకుండా ఆమీర్ ఖాన్ మార్కేట్ స్థాయి 700-800 కోట్లు.అతని ప్రతీ సినిమా అంతే కలెక్ట్ చేస్తుంది.మరి ప్రభాస్ సంగతి ఏంటి ? బాహుబలి తరువాత బాహుబలి స్థాయిలో కలెక్షన్లు రాబడితే, అప్పుడు ఒప్పుకోవచ్చు ప్రభాస్ ఆలిండియా నెం.1 అని.అప్పటిదాకా ప్రభాస్ బాక్సాఫీస్ పవర్ మీద ఓ అంచనాకి రాకపోవడమే కరెక్ట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube