బీజేపిలోకి ప్రభాస్ .. పవన్ కి పోటీగా ప్రచారం

గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లలో టిడిపి విజయం వెనుక పవన్ కంట్రిబ్యూషన్ ఎంత అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పాల్సిన మాట.కాని ఓ సగటు ప్రజలకు మాత్రం అర్థమయ్యే విషయం ఏమిటంటే, జనాలు సభలకి ఉత్సాహవంతంగా రావడానికి మాత్రం పవన్ పేరు బాగా పనికొచ్చింది.

 Prabhas Into Bjp? A Bold Move Against Pawan Kalyan?-TeluguStop.com

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్.అభిమానులకి ఆయన దేవుడితో సమానం.

అందుకే పవన్ ఛరిష్మా టీడిపి -బీజేపి విజయానికి ఏమో కాని, ప్రచారానికి మాత్రం బాగా పనికొచ్చింది.ఇప్పుడు బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ఉర్రుతలూగించే ప్రచారమే కావాలి.

జనాలు సభలకి ఆసక్తి చూపించాలంటే పవన్ ని ఢీకొట్టే సినీముఖం కావాలి.అందుకే ప్రభాస్ కి కబురు వెళ్ళింది.

Prabhas into BJP? A bold move against Pawan Kalyan? - Prabhas Into Bjp A Bold M

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చాలా సీనియర్ బీజేపి నాయకులు.కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి.ప్రభాస్ ని రాజకీయాల్లోకి లాగే బాధ్యత ఆయనపైనే వేసిందట బీజేపి.ప్రభాస్ చేత ప్రచారం చేయించుకోవాలని వారి అత్యాశ.అసలే బాహుబలి వేడి నడుస్తోంది .ప్రభాస్ ఇమేజ్ ఎక్కడినుంచి ఎక్కడికో వెళ్ళింది.ఈ వేడిని క్యాష్ చేసుకోవాలి, పవన్ ప్రచారాన్ని ప్రభాస్ అనే బ్రహ్మాస్త్రంతో ఢీకొట్టాలి .ఇదే బీజేపి ప్లాన్.

Prabhas into BJP? A bold move against Pawan Kalyan? - Prabhas Into Bjp A Bold M

మరి ప్రభాస్ దీనికి ఒప్పుకుంటాడా? బాహుబలితో వచ్చిన ఆకాశమెత్తు ఇమేజ్ ని పెదనాన్న కోసం రిస్కులో పెడతాడా? పవన్ అల్రెడి ప్రజల నమ్మకం పొందిన లీడర్.అసలే ప్రభాస్ కి బిడియం.మరి పవన్ ధీటుగా ప్రభాస్ మాట్లాడగలడా? ఈ టైమ్ లో పద్ధతిగా పెద్ద సినిమాలు చేసుకుంటూ, ఇప్పటిదాకా ఎలా ఉన్నాడో అలా ఉంటేనే బెటర్ కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube