అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు కోటి క్లిక్స్‌

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌ ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు.టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా బాలీవుడ్‌లో సైతం రికార్డును బద్దలు కొట్టింది.

 Prabhas Flop Movie Gets One Crore Hits-TeluguStop.com

‘బాహుబలి’ తెచ్చిన క్రేజ్‌తో ప్రభాస్‌ గత చిత్రాలు హిందీ, తమిళం, మలయాళంలో డబ్బింగ్‌ చేస్తున్నారు.గతంలో పలు చిత్రాల్లో నటించిన ప్రభాస్‌ సక్సెస్‌, ఫ్లాప్‌లను దక్కించుకున్నాడు.

ఇక్కడ సక్సెస్‌ అయిన చిత్రాలతో పాటు ఫ్లాప్‌ చిత్రాలు కూడా డబ్బింగ్‌ అవుతున్నాయి.

ప్రభాస్‌ కెరీర్‌లో డిజాస్టర్‌ చిత్రం అంటే ‘రెబల్‌’ ముందు ఉంటుంది.

ఈ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

ఆ చిత్రాన్ని తాజాగా హిందీలో డబ్‌ చేశారు.థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న హిందీ ‘రెబల్‌’ చిత్రం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటి వరకు ‘రెబల్‌’ హిందీ వర్షన్‌ను యూట్యూబ్‌లో కోటి మందికి పైగా చూశారు.ఒక సౌత్‌ సినిమా హిందీ డబ్బింగ్‌ను ఈ స్థాయిలో ఎప్పుడు కూడా నెటిజన్లు చూసింది లేదు.

ప్రభాస్‌కు ‘బాహుబలి’ వ్ల వచ్చిన క్రేజ్‌తోనే ఈ వ్యూస్‌ వచ్చాయని నిర్మాతలు సైతం ఒప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube