ఇంగ్లీషులో లో మాట్లాడలేక ప్రభాస్ తిప్పలు

ప్రభాస్ నేషనల్ వైడ్ స్టార్ అయ్యాడు.నెషనల్ సినిమా జర్నలిస్టులు వరుసపెట్టి ప్రభాస్ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు.

 Prabhas Facing Difficulty In Speaking English For Interviews-TeluguStop.com

బాహుబలి 2 విడుదలకి మరో నెలరోజులు, అంతకన్నా ఎక్కువ సమయమే ఉంది.హిందీ వెర్షన్ ప్రమోషన్ కోసం ప్రభాస్ ఓ పదిహేను రోజులు ఈజిగా కేటాయిస్తాడు.

ఇక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలు అంటే, అయితే హిందీలో ఉంటాయి, లేదంటే ఇంగ్లీషులో ఉంటాయి.మనవాళ్ళు ఎలాగో ఇబ్బంది లేకుండా హిందీ మాట్లాడటం కష్టం కాబట్టి, ఇంటర్వ్యూలు అన్ని ఇంగ్లీషులోనే జరుగుతున్నాయి.

రానాకి బాలివుడ్ వాతావరణం బాగా అంటే బాగా అలవాటు.ఇంగ్లీషులో ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడేస్తాడు.

జక్కన్న కూడా ఎలాంటి తడబాటు లేకుండా అంగ్లంలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.వీరిద్దరికి నేషనల్ మీడియా ఫోకస్ బాగా అలవాటు.

ఇక తమన్నా ఎట్లాగో రఫ్ ఆడించేస్తుంది.అనుష్క ఇంటర్వ్యూలు ఇచ్చేది తక్కువ, కాని ఇచ్చినప్పుడల్లా, తను కూడా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొనట్లేదు.

ఎటుచేసి ఈ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలలో ఇబ్బందిపడుతున్నది ప్రభాస్ ఒక్కడే.

గంటలకొద్దీ ఇంగ్లీషులో మాట్లాడే అలవాటు లేకపోవడం వలనో, లేక ఈ నేషనల్ మీడియా అటెన్షన్ ఇంకా కొత్తగా అనిపించడం వలనో, ప్రభాస్ తడబడుతున్నాడు.

స్వేచ్ఛగా తన భావాలన్ని బయటపెట్టలేకపోతున్నాడు.ఇంగ్లీషు పూర్తిగా రాక కాదు, గ్యాప్ లేకుండా మాట్లాడే అలవాటు లేక అంతే.

ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోవడం చిన్నతనం కానే కాదు.కాని మన డార్లింగ్ తన ఆంగ్ల వాక్చాతుర్యాన్ని మెరుగుపరుచుకోవాలి.

ఎందుకంటే ఇకనుంచి ప్రభాస్ మీద ఇండియన్ మీడియా మొత్తం కన్నేసి ఉంచుతుంది.రేపు బాహుబలి 2 చాలా పెద్ద హిట్ అయితే హాలివుడ్ మీడియా కూడా ప్రభాస్ ఇంటర్వ్యూ అడుగుతుందేమో … ఏమో ఎవరికి తెలుసు?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube