హీరో ఫాలోయింగ్ , స్టామినా అనేది ఎప్పుడైనా కలెక్షన్ల ద్వారానే తెలుస్తుంది.అందుకే రికార్డుల పిచ్చి బాగా ఉంటుంది మన కథానాయకులకి.
ఇప్పుడు ఒక కొత్త స్టార్ పుట్టుకొస్తున్నాడు.అది కూడా కేవలం తన స్టామినా ద్వారానే కాదు.
కుటుంబ బలం, పిఆర్ టీమ్ బలం, మీడియా బలంతో.
ఇరవై వస్తే పాతిక వచ్చిందని చెప్పాలి.
పబ్లిక్ లో పాతిక వచ్చినట్లే ప్రచారం జరగాలి.అలా జరగాలి అంటే మీడియా పాతిక అనే ప్రచారం చేయాలి.
హీరో ఇలా అర్డరు వేయగానే, ఆయన పీఆర్వో పని చేసి పెట్టేస్తాడు.ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది.
కలెక్షన్లు ఎక్కువ చూపిస్తే, పంపిణీదారులకి లాభాలేమి రావు, కాని చేస్తున్న ప్రచారాన్ని డిస్ట్రిబ్యూటర్లు తప్పుపట్టే సాహసం చేయరు.అడిగే ధైర్యం ఎవరికి ఉందని.
ఇదంతా దేనికి అంటే, ఆయన ఇప్పుడు ఒక అగ్రనటుడు అని పబ్లిక్ మాట్లాడుకోవాలి.ఖర్చు వచ్చినా, నష్టాలు వచ్చినా, పెద్ద మ్యాటరేమి కాదు ఇక్కడ.