పవన్ కి బలం, మహేష్ కి బలహీనత

గత సంవత్సరం శ్రీమంతుడుతో బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసి తన స్టామినా ఏంటో మరోమారు చూపెట్టాడు సూపర్ స్టార్ మహేష్.ఈ రికార్డులు ఏంతోకాలం నిలవడం కష్టంగానే కనిపిస్తోంది.

 Powerstar All Set To Dominate Superstar-TeluguStop.com

ప్రీ-రిలీజ్ బిజినెస్ లో ఇప్పటివరకు సర్దార్ దే పైచేయి.అందుకు కారణం పవన్ వెనుక బలం ఉంటే, మహేష్ వెనుక బలహీనత ఉంది.

గబ్బర్ సింగ్ బ్రాండ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ వస్తూ ఉండటం పవన్ బలం.సహజంగానే సీక్వెల్స్ కి మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది.మళ్ళి గబ్బర్ సింగ్ లాంటి కల్ట్ బ్లాక్బస్టర్ బ్రాండ్ కావడం ఇంకా అదనపు బలం.పవర్ స్టార్ ఫుల్ లెంగ్త్ రోల్ లో చాలాకాలం తరువాత కనిపించనుండటం, పక్కా మాస్ సినిమా కావడం కూడా సర్దార్ కి కలిసివస్తున్నాయి.

ఇక మహేష్ కి ఉన్న బలహీనత, బ్రహ్మోత్సవం పక్కా క్లాస్ సినిమా కావడం.అత్తారింటికి దారేది క్లాస్ సినిమానే అయినా, త్రివిక్రమ్ మార్కెట్ ని అడ్డాలతో పోల్చలేం.

ఎలాంటి బ్రాండ్ లేకుండా దిగుతున్నాడు మహేష్.

ఈ రకంగా చూస్తోంటే సూపర్ స్టార్ ని పవర్ స్టార్ డామినేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

రికార్డులు ఎవరు కొడతారు అనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటే అయినా, సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కెరీర్ లో ప్రత్యేకం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube