రవితేజ - భరత్ అనుబంధంపై పచ్చినిజాలు బయటపెట్టిన పోసాని

ఏ విషయం అయినా సరే, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం పోసాని కృష్ణమురళిది.తనకు ఒప్పు అనిపిస్తే ఒప్పు అంటారు, తప్పు అనిపిస్తే తప్పు అంటారు.

 Posani Opens Up On Raviteja – Bharath Relations-TeluguStop.com

అలాంటి పోసాని రవితేజ తమ్ముడు భరత్ కి చాలా క్లోజ్.వీరి స్నేహం రవితేజ స్టార్ అయ్యాక మొదలైంది కాదు, రవితేజ ఇంకా నటుడిగా ప్రయత్నాల్లో ఉండగానే మొదలైంది.

భరత్ ప్రేమ వివాహానికి సహాయం చేసారు పోసాని.తాను పరిచూరి గోపాలకృష్ణ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న రోజుల్లో భరత్ కి, అతని ప్రేయసికి ఉండటానికి తన రూమ్ లో చోటిచ్చి, బయట నిద్రపోయారు పోసాని.

ఈ క్రమంలో పరుచూరి వారితో సంబంధాలు దెబ్బతిన్నా, భరత్ తో స్నేహం వదల్లేదు.మరి అలాంటి పోసాని రవితేజ – భరత్ ల మధ్య సంబంధాల గురించి, రవితేజ భరత్ అంతక్రియలకు రాకపోవడం గురించి ఒక టీవి ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన నిజాలయ బయటపెట్టారు.

భరత్ పలుమార్లు డ్రగ్స్, మద్యం ఉచ్చులో పోలీసుల చేతికి చిక్కిన సంగతి తెలిసిందే.ఈ విషయం మీద రవితేజ పోసానితో కొన్నిసార్లు మాట్లాడారట.“ఒక్కసారి అంటే సహాయం చేస్తాను, రెండుసార్లు అంటే సహాయం చేస్తాను, ఎప్పుడు ఇలానే జరుగుతోంటే ఏం చేయాలి? తనకి మంచి కథలు చెప్పి ఎంతోమంది కొత్తవారు సంపాదించుకున్నారు.మరి నా పేరుని, స్థాయిని సంపాదనకి వాడుకోకుండా, ఇలా చెడ్డపేరు ఎందుకు తీసుకురావడం.

చిన్నపిల్లాడు కాదు చెప్పడానికి, తను చేస్తున్న తప్పులేంటో తనకి కూడా బాగా అర్థమయ్యేంత పెద్దవాడు.నాకు అన్ని ఉన్నా చెడ్డ అలవాట్లు లేవు మరి వాడికెందుకు.సరిగా ఉంటే తోడుగా నేను ఉంటానుగా” అనే అర్థం వచ్చేలా రవితేజ చాలాసార్లు తన తమ్ముడి గురించి మాట్లాడేవారట.

మరోవైపు భరత్ రవితేజ గురించి పెద్దగా మాట్లాడకపోయినా, తన చెస్తున్న తప్పుల గురించి ఎప్పుడూ బాధపడేవాడట.

ఎందులు డ్రగ్స్ కి అలవాటు పడ్డాడో, ఎందుకు మద్యానికి బానిసయ్యాడో తనకు కూడా తెలియదని, భరత్ వ్యక్తిగా మంచోడు కాని చెడు అలవాట్లకు దగ్గరయ్యాడు తప్ప చెడ్డవారు కాదని పోసాని చెప్పుకొచ్చారు.రవితేజ కంటే ముందు ఏ విషయమైనా పోసానితోనే పంచుకునేవాడట.

చనిపోవాలని ఉంది అనే నిరుత్సాహాన్ని కూడా కొన్ని సార్లు భరత్ వ్యక్తపరిచినట్లు పోసాని చెప్పారు.

ఇక రవితేజ భరత్ అంతక్రియలకు రాకపోవడంపై స్పందిస్తూ, రవితేజ నిర్ణయాన్ని సమర్థించారు.

తమకి చెడ్డపేరు తీసుకొచ్చిన వారి గురించి మనుషులు కఠినంగా వ్యవహరించడంలో తప్పులేదని, తాను కూడా సొంత మేనమామ చనిపోతే వెళ్ళలేదని, బంధాలు ఎదుటివ్యక్తి ప్రవర్తన మీద నిలబడతాయి లేదా కూలిపోతాయి అని పోసాని అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube