Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ప్రభుత్వ ప్రకటనలు రావాల్సిన తెరపై పోర్న్ వీడియో .. ఢిల్లీ మెట్రోలో సంచలనం-Porn Video Plays On Delhi Metro Railway Station LED Screen

గత ఆదివారం మధ్యాహ్నం సమయం. ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో రైల్వే స్టేషన్ ఎప్పటిలాగే చాలా రద్దీగా ఉంది. అక్కడున్న ఒక LED తెరపై ఎప్పటిలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయి. ఎప్పటిలాగే ఆ తెరని ఎవరు పెద్దగా పట్టించుకోకుండా కదిలిపోతున్నారు. కాని క్షణాల్లోనే అందరి చూపులు ఆ తెరవైపే మళ్ళాయి. అందుకు కారణం, ఎప్పటిలాగా కాకుండా, ఆ తెరపై పోర్న్ వీడియో ప్రత్యక్షమైంది. ఒక మెట్రో రైల్వే స్టేషన్లో, అంత పెద్ద సౌండ్ సిస్టమ్ తో పబ్లిక్ తెరమీద పోర్న్ వీడియో ప్లే అవుతుండటంతో ప్రజలు బాగా ఇబ్బందిపడ్డారు. అయితే కొందరు ఈ విషయాన్ని గాలికి వదిలేయకుండా తమ ఫోన్ లో ఈ తతంగాన్ని బంధించారు. తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ లో ఢిల్లీ మెట్రో ఆఫిసర్ల పనితనాన్ని ఎండగట్టారు. ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ గా వెళుతోంది.

ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మెట్రో రైల్ అధికారులు, ఆ LED తెరపై ప్రభుత్వ ప్రకటనలు వేసే బాధ్యత ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చినట్లు, ఆ తెర పూర్తిగా అదే ప్రైవేట్ సంస్థ కంట్రోల్ లో ఉంది, ఈ తప్పుకి పూర్తి బాధ్యత వారిదే, ఇది ప్రభుత్వ అధికారుల తప్పు కాదు, విచారణ మొదలుపెట్టాం, బాధ్యులని వదిలిపెట్టేది లేదు అంటూ సమాధానమిచ్చారు.

ఇక ఈ విడియో సోషల్ మీడియాలో నిజంగానే హల్చల్ చేస్తోంది. ట్విట్టర్ అందరు జోకులు పేలుస్తున్నారు .. ఇదేరకంగా అన్ని రైల్వే స్టేషన్స్ లో పోర్న్ వీడియోలు ప్రదర్శిస్తే ప్రయాణికులంతా రైలు మార్గాన్నే ఎంచుకోని బస్సు వదిలేస్తారని కొందరంటే, ఉచిత ఇల్లు, ఉచిత నీరు లాగా ఉచిత పోర్న్ కూడా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పథకం, మీ డేటాను ఖర్చు చేయకుండా, రైల్వే స్టేషన్స్ కి వెళ్ళండి అని మరికొందరు, జియో ఉచిత ఆఫర్ అయిపోతోందిగా, ఇక జనాలకి పోర్న్ చూసే అవకాశం తక్కువగా దొరుకుతుందని ప్రభుత్వం ఈ పని చేసిందేమో అని మరో పాపులర్ జోక్ వినబడుతోంది.

Continue Reading
To Top