అడవుల్లో కోతులు పెంచుకున్నాయి ఈ పాపని .. మనుషుల్లోకి వచ్చినా కోతిలానే ప్రవర్తిస్తోంది

అనగనగా ఒక అడవి.ఆ అడవి నిండా జంతువులే.

 Police Found A Little Girl Who Was Raised By Monkeys In The Jungle-TeluguStop.com

అందరు మంచి మనసున్నవారు.అందులోనూ తోడేలు గుంపు మరీ మంచిది.

అందుకే అడవి మొత్తంలో ఉన్న ఒకే ఒక్క మనిషి బిడ్డ మోగ్లీని తోడేలు గుంపుకి అప్పగించాడు బగీరా.చిన్నారి మోగ్లీ అడవిలోనే ఆ తోడేలు గుంపుతోనే కలసి పెరిగాడు.

ఆ గుంపు సహాయంతోనే తన ప్రాణాలు తీయాలనుకున్న పులి షేర్ ఖాన్ ని హతమార్చాడు మోగ్లీ.అంతేతప్ప షేర్ ఖాన్ కి భయపడి మనుషుల వద్దకు పారిపోలేదు మోగ్లీ.

ఈ కథనే మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం.జంగల్ బుక్ సినిమాగా వస్తే కూడా చూసాం.

ఇప్పుడు ఇంచుమించు ఇలాంటి కథ నిజం జీవితంలో కూడా జరిగినట్లు బయటపడింది.

కాని మోగ్లీ ఇక్కడ అబ్బాయి కాదు, అమ్మాయ.

అడవిలోనే పెరిగింది కాని తోడేళ్ళతో కాదు, కోతులతో.మోగ్లీ కథ భారత ఆడవుల్లోనే జరిగినట్టు .ఈ మోగ్లీ కథ కూడా భారత అడవిలోనే జరిగింది.కాని ఇందులో విలన్ లేడు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి వయసు 10-12 ఏళ్ళ దాకా ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు.తనని కటార్నియా ఘాట్ అడవుల్లో కోతులతో తిరగడం చెట్లు కొట్టేవారు చూసారట.

ఆ అడవిలో ఉన్న పోలీసు ఆఫీసర్ తనని కోతులనుంచి వేరు చేసి, అతికష్టం మీద పట్నం తీసుకొచ్చారు.విశేషం ఏమిటంటే, ఈ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు పోలీసులని కోతులు వెంబడించాయట.

ఈ చిన్నారి ఏమి మాట్లాడలేకపోతోంది.చేతులు ఉపయోగించి జంతువులా పాకుతోంది.

పాపం చిన్ననాటి నుంచే కోతులతో పెరిగింది ఏమో, తను మనిషిని అని గుర్తించలేకపోతోంది.ఈ అమ్మాయి దొరికినప్పుడు తన ఒంటి మీద వస్త్రాలు కూడా లేవట.

ఇక అర్థం చేసుకోండి .తను ఏమాత్రం మనిషిలా ప్రవర్తించట్లేదని.ఆహారం జంతువులానే నోటితో తీసుకోని తింటోందట, హావభావాలు, నడవడిక అన్ని కోతినే పోలి ఉన్నాయి.

ప్రస్తుతానికైతే ఈ అమ్మాయిని ఓ హాస్పిటల్ లో ఉంచారు.మెల్లిమెల్లిగా మనుషుల అలవాట్లు నేర్పిస్తున్నారు.ఉత్తర ప్రదేశ్ లో నమోదైన చిన్నారుల మిస్సింగ్ కేసులన్నటిని తిరగేస్తామని, ఈ అమ్మాయి తల్లిందండ్రులు ఎవరో వెతుకుతామని చెబుతున్నారు పోలీసులు.

చిన్నప్పటి నుంచి పెంచుకున్న పాపని మనుషులు ఎత్తుకుపోయారని ఆ కోతులు మరోవైపు బాధపడుతూ ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube