Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అడవుల్లో కోతులు పెంచుకున్నాయి ఈ పాపని .. మనుషుల్లోకి వచ్చినా కోతిలానే ప్రవర్తిస్తోంది-Police Found A Little Girl Who Was Raised By Monkeys In The Jungle

అనగనగా ఒక అడవి. ఆ అడవి నిండా జంతువులే. అందరు మంచి మనసున్నవారు. అందులోనూ తోడేలు గుంపు మరీ మంచిది. అందుకే అడవి మొత్తంలో ఉన్న ఒకే ఒక్క మనిషి బిడ్డ మోగ్లీని తోడేలు గుంపుకి అప్పగించాడు బగీరా. చిన్నారి మోగ్లీ అడవిలోనే ఆ తోడేలు గుంపుతోనే కలసి పెరిగాడు. ఆ గుంపు సహాయంతోనే తన ప్రాణాలు తీయాలనుకున్న పులి షేర్ ఖాన్ ని హతమార్చాడు మోగ్లీ. అంతేతప్ప షేర్ ఖాన్ కి భయపడి మనుషుల వద్దకు పారిపోలేదు మోగ్లీ. ఈ కథనే మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. జంగల్ బుక్ సినిమాగా వస్తే కూడా చూసాం. ఇప్పుడు ఇంచుమించు ఇలాంటి కథ నిజం జీవితంలో కూడా జరిగినట్లు బయటపడింది.

కాని మోగ్లీ ఇక్కడ అబ్బాయి కాదు, అమ్మాయ. అడవిలోనే పెరిగింది కాని తోడేళ్ళతో కాదు, కోతులతో. మోగ్లీ కథ భారత ఆడవుల్లోనే జరిగినట్టు .. ఈ మోగ్లీ కథ కూడా భారత అడవిలోనే జరిగింది. కాని ఇందులో విలన్ లేడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి వయసు 10-12 ఏళ్ళ దాకా ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. తనని కటార్నియా ఘాట్ అడవుల్లో కోతులతో తిరగడం చెట్లు కొట్టేవారు చూసారట. ఆ అడవిలో ఉన్న పోలీసు ఆఫీసర్ తనని కోతులనుంచి వేరు చేసి, అతికష్టం మీద పట్నం తీసుకొచ్చారు. విశేషం ఏమిటంటే, ఈ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు పోలీసులని కోతులు వెంబడించాయట.

ఈ చిన్నారి ఏమి మాట్లాడలేకపోతోంది. చేతులు ఉపయోగించి జంతువులా పాకుతోంది. పాపం చిన్ననాటి నుంచే కోతులతో పెరిగింది ఏమో, తను మనిషిని అని గుర్తించలేకపోతోంది. ఈ అమ్మాయి దొరికినప్పుడు తన ఒంటి మీద వస్త్రాలు కూడా లేవట. ఇక అర్థం చేసుకోండి .. తను ఏమాత్రం మనిషిలా ప్రవర్తించట్లేదని. ఆహారం జంతువులానే నోటితో తీసుకోని తింటోందట, హావభావాలు, నడవడిక అన్ని కోతినే పోలి ఉన్నాయి.

ప్రస్తుతానికైతే ఈ అమ్మాయిని ఓ హాస్పిటల్ లో ఉంచారు. మెల్లిమెల్లిగా మనుషుల అలవాట్లు నేర్పిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో నమోదైన చిన్నారుల మిస్సింగ్ కేసులన్నటిని తిరగేస్తామని, ఈ అమ్మాయి తల్లిందండ్రులు ఎవరో వెతుకుతామని చెబుతున్నారు పోలీసులు. చిన్నప్పటి నుంచి పెంచుకున్న పాపని మనుషులు ఎత్తుకుపోయారని ఆ కోతులు మరోవైపు బాధపడుతూ ఉంటాయి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu

 • Genral

  Dieting Mistakes You Must Avoid

  By

  ఈ రోజుల్లో బరువు ఎక్కువ ఉన్న వారు తగ్గించుకోవటానికి మరియు సమాన బరువు ఉన్నవారు ఇంకా పెరగకుండా ఉండటానికి అనేక పాట్లు...

 • Genral

  Top 5 porn watching Indian cities

  By

  హైదరాబాద్ విశ్వనగరం అవుతుందని, విశ్వనగరాల పేర్లు తీసేటప్పుడు హైదరాబాద్ ని కూడా కలిపి చెప్పే రోజు వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్...

 • Genral

  What if your Eyes Twitch

  By

  చాలా మంది మగవారికి ఎడమ కన్ను,ఆడవారికి కుడి కన్ను అదిరితే చాల అనర్ధాలు జరుగుతాయని నమ్ముతారు. ఈ విషయం సాంప్రదాయ శకున...

 • Genral

  Why we Shouldnt Pour Laundry Water on Feet

  By

  సాధారణంగా చాలా మంది స్త్రీలు బట్టలు ఉడికాక ఆ నీటిని కాళ్ల మీద పోసుకుంటూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు....

To Top