పార్లమెంటు ప్రారంభం కాగానే ప్రధాని విదేశీ టూరు

ప్రధాని నరేంద్ర మోడీ ఇండియాలో ఉండేది తక్కువ , విదేశాల్లో ఉండేది ఎక్కువ.ప్రధాని విదేశాల్లో ఉంటూ అప్పుడప్పుడు ఇండియాకు వస్తారని కొందరు విమర్శిస్తుంటారు.

 Pm Modi  Leaves For Paris-TeluguStop.com

ఈ విమర్శల్లో అవాస్తవం లేదు.ఈ మధ్యనే సింగపూర్ , మలేషియా వెళ్లి వచ్చిన మోడీ ఈ రోజు ప్యారీస్కు బయలుదేరి వెళ్ళారు.

కీలకమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగానే విదేశీ పర్యటన కూడా ప్రారంభం అయింది.పార్లమెంటులో కీలక చర్చల్లో పాల్గొనాల్సిన ప్రధాని , ముఖ్యమైన అంశాలకు జవాబు చెప్పాల్సిన ప్రధాని విదేశాలకు వెళ్ళిపోయారు.

వాతావరణ మార్పులపై 12 రోజులపాటు జరిగే శిఖరాగ్ర సమావేశాల్లో మోడీ పాల్గొంటున్నారు.ఈ సమావేశాల్లో ప్రధానిగా ఆయన పాల్గొనాల్సిందే .తప్పదు.కానీ పార్లమెంటు సమావేశాలు అడ్డురాకుండా చూసుకుంటే బాగుండేది.

పార్లమెంటు సమావేశాలు, ప్యారీస్ పర్యటన తేదీలు ముందే ఖరారు అవుతాయి.అలాటప్పుడు తేదీలు క్లాష్ కాకుండా చూసుకోవడం సాధ్యం కాదా? దేశంలో పెను సంచలనం కలిగించిన, అనేక వివాదాలు రేకెత్తించిన అసహనం పై పార్లమెంటులో చర్చ జరగబోతున్నది.ఇందులో ప్రధాని తప్పనిసరిగా పాల్గొనాలి.జవాబులు చెప్పాలి.చాలా మంది మోడీ మీదనే నేరుగా విమర్శలు చేశారు.ఇప్పుడు జవాబులు చెప్పే బాధ్యత వెంకయ్య నాయుడు, అరుణ్జైట్లీ, రాజ్ నాధ్ సింగ్ తీసుకోవచ్చు.

మోడీ లేని పార్లమెంటు ఎలా జరుగుతుందో చూడాలి .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube