నాలుగైదుగురు అమ్మాయిలతో ఒకేసారి సరససల్లాపాలు ఆడుతూ, అవలీలగా అమ్మాయిలని బుట్టలో వేసుకునే అబ్బాయిలని ఏమంటారు ? “ప్లే బాయ్” అనే కదా.ఈ ప్లే బాయ్ అనే పదం ఒక అమెరికన్ లైఫ్ స్టయిల్ మ్యగజీన్ నుంచి వచ్చింది.
ఇక ప్లే బాయ్ మ్యాగజీన్ ఎందువల్ల ఫేమస్ అయ్యిందో ఇక్కడ చాలామందికి తెలుసు.అయినా, తెలియనివారి కోసం ఓసారి గుర్తుచేస్తున్నాం.
ప్లే బాయ్ మ్యాగజీన్ అంత ప్రాచుర్యం పొందడానికి కారణం నగ్న ఫోటోషూట్లు
అవును, అందమైన మోడల్స్, సెలెబ్రిటీలతో నగ్న ఫోటోషూట్స్ చేయడంచడం ఈ మ్యాగజీన్ ప్రత్యేకత.మన భారతీయ మోడల్ కమ్ నటి మోనా చోప్రా కూడా ఈ మ్యాగజీన్ కి ఒంటిపై పోగు లేకుండా ఫోజిలిచ్చింది.
అలాంటి మ్యాగజీన్ ఈ మధ్య నగ్న చిత్రాలు పెట్టడం మానేసింది.మరో అడుగు ముందుకేసి, తొలిసారిగా ఓ ముస్లిం యువతిని, అది కూడా నిండు బట్టలతోపాటు హిజాబ్ తో తన కవర్ పేజ్ ని ప్రచూరిస్తోంది.
ఇప్పుడు ఇదో పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది
ఇందులో మ్యాగజీన్ తప్పు కాని, మోడల్ గా ఫోజులిచ్చిన 22 ఏళ్ళ అమెరికన్ ముస్లీమ్ జర్నలిస్టు నూర్ తాగౌరి తప్పుగాని లేదు.ఎటువంటి అశ్లీలత లేకుండా నిండు బట్టలతో, పైగా హిజాబ్ తో షూట్ చేసిన ఫోటోలనే పెడుతున్నారు.
ఇది ముస్లీమ్ యువతుల ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని మ్యాగజీన్ తో పాటు నూర్ భావిస్తోంటే, మత సంస్థలు మాత్రం ఈ చర్యపై విరుచుకుపడుతున్నాయి
నగ్నచరిత్ర కలిగిన ఒక మ్యాగజీన్ కి ఒక ముస్లీం మహిళ ఫోజులివ్వడం ఏంటని మతవాదులు కోపం వెళ్ళగక్కుతున్నారు.కాని నూర్ మాత్రం అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవట్లేదట.
ప్రాక్టికల్ గా అలోచించేవారు తనను ఎంతో మెచ్చుకుంటున్నారని మురిసిపోతోంది.