ప్రతి రైతుకి ఉపయోగపడే యాప్ ఇది .. అందరికీ తెలియజేయండి

అమ్మాయిని ఎలా పడేయాలి? వీటికి యాప్స్ ఉన్నాయి.అమ్మాయి – అబ్బాయి డేటింగ్ చేసుకోవడానికి కూడా యాప్స్ ఉన్నాయి, ఫోటోకి కుక్కలు, నక్కల స్టికర్స్ అంటించే యాప్స్ ఉన్నాయి, చివరకి ముఖానికి గడ్డం, మీసం అంటించే యాప్స్ ఉన్నాయి.

 Plantix – A Must Have App For All Farmers For Their Needs And Doubts-TeluguStop.com

ఇన్ని పనికిరాని యాప్స్ మధ్య ఓ పనికొచ్చే యాప్ వచ్చింది.అన్నదాతకు సహాయం చేయడానికి, ఆదుకోవనికి, సమాచారాన్ని, సమస్యలకి పరిష్కారాన్ని అందించే యాప్ వచ్చింది.

ఆ యాప్ పేరే Plantix.

ఇందులో రైతులకి అవసరమయ్యే విలువైన సమాచారం అంతా ఉంటుంది.ఇది తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉండటం విశేషం.మీ పంటకి ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య ఏంటో, రావడానికి కారణం ఏంటో, దాని పరిష్కారం ఏంటో, అన్నీ తెలుసుకోవచ్చు.

ఉదాహారణకు మీరు టమాట పండిస్తున్నారు అనుకోండి, దానికేదో సమస్య వచ్చింది.అది ఏంటి అనేది మీకు అర్థం కావడం లేదు, లేదా సమస్య తెలిసినా దానికి పరిష్కారం అంతుచిక్కడం లేదు, అప్పుడు మీరు టామాట ఆప్షన్ ని సెలెక్టు చేసుకోని, మీ పంట, ఆ దెబ్బలు బాగా కనిపించేలా ఫోటో తీసి అప్లోడ్ చేయాలి.

ఆ ఫోటోని స్కాన్ చేసుకోని మీ సమస్యను గుర్తిస్తుంది ఈ యాప్.ఆ తరువాత ఆ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా తెలియజేస్తుంది.

మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ఆ యాప్ లో ఫోటోని పోస్ట్ చేస్తే మీ పోస్టు వేలమందికి చేరుతుంది.అందులో దానికి పరిష్కారం తెలిసినవారు మీ పోస్ట్ పై పరిష్కారాన్ని కామెంట్ చేసినా చేయవచ్చు.

ఈ యాప్ GPS ద్వారా మీ ఏరియాని ట్రాక్ చేసి వాతవరణ వివరాల్ని కూడా తెలుపుతుంది.గాలి వేగం, గాలి దిశ, తేమ, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి, వచ్చే అయిదు రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవించవచ్చు ? ఇవ్వన్ని తెలుపుతుంది.

ఇక ఇందులో చివరగా ఉన్న ఆప్షన్ గ్రంథాలయం.ఎన్నోరకాల పంటల గురించి, వాటికి సోకగలిగే వ్యాధుల గురించి, వ్యాధి లక్షణాలు, పరిష్కారాల గురించి , వాటిని పండించే తీరుని గురించి .ఇలా ఓ పంట గురించి A టూ Z మీరు అక్కడే చదువుకోవచ్చు.మొత్తం మీద తెలుగు చదవగలిగే ప్రతి రైతు దగ్గర ఉండాల్సిన యాప్ ఇది.ఇంత ఉపయోగకరమైన యాప్ గురించి మీరు తెలుసుకోవడమే కాదు, మీ మిత్రులకొ షేర్ చేసి, వారిని వారి మిత్రులకి షేర్ చేయమని చెప్పండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube