గుడ్లను ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిదా కాదా ?

మన ఇండియన్స్ కి కామన్ గా ఓ అలవాటు ఉందండి.వంటరూములో ఉండే ఎలాంటి పదార్థాన్ని అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం.

 Placing Eggs In Refrigerator Is Good Or Bad?-TeluguStop.com

ఓ పూట వండిన కూర మరో పూట తినాలన్నా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం, పెరుగైన ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం, కూరగాయలైనా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం, చివరకి కోడి గుడ్లు అయినా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం.ఫ్రిడ్జ్ లో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనేది చాలా పెద్ద టాపిక్ కాని, ప్రస్తుతానికైతే గుడ్ల గురించి మాట్లాడుకుందాం.

అసలు కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టాలి? ఏ కారణంతో ఈ అలవాటు చేసుకున్నాం? ఇలా అడిగితే ఎవరు సమాధానం చెప్పలేరు.ఎందుకంటే కోడికుడ్లను ఫ్రిడ్జ్ లో ఎందుకు పెడుతున్నామో మనకు కూడా తెలిదు.

అలా పెడితే గుడ్లు ఫ్రెష్ గా ఉంటాయి అనుకుంటారు అంతే.అందుకే పెట్టేస్తుంటారు.

మరి గుడ్లను ఫ్రిడ్జ్ లో పెట్టాలా వద్దా ?

ఎలాగైతే బ్రిటిష్ ఇంగ్లీష్ మరియు అమెరికన్ ఇంగ్లీష్ అంటూ రెండు రకాల ఇంగ్లీష్ ఉందొ, అలాగే గుడ్డుని ఫ్రిడ్జ్ లో పెట్టడం అనే టాపిక్ మీద కూడా బ్రిటీష్ మరియు అమెరికన్ అభిప్రాయాలు ఉన్నాయి.గుడ్లను ఫ్రిడ్జ్ లో పెట్టకూడని బ్రిటిష్ వారు అంటారు.

గుడ్లని ఫ్రిడ్జ్ లో పెట్టాలి అని అమెరికన్ వారు అంటారు.మన భారతీయులు ఎలాగో అమెరికన్ ఇంగ్లిష్ ఎక్కువ వాడతారు, అలాగే ఈ గుడ్ల విషయంలో కూడా అమెరికన్ పద్ధతినే పాటిస్తూ గుడ్లను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు.

మరి ఈ రెండు పద్ధతుల్లో ఏది కరెక్టు? ఏది తప్పు? ఈ విషయం మీద సైంటిస్టులు కూడా ఏకాభిప్రాయం మీదకి రాలేకపోతున్నారు.

గుడ్లంటే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా గుర్తుకు వస్తుంది పరిశోధకులకి.

ఇది చాలా హానికరమైన బ్యాక్టీరియా.మన శరీరాన్ని చాలావిధాలుగా అనారోగ్యం పాలు చేస్తుంది.

పౌల్ట్రీ వాళ్ళు కోడ్లను మామూలు టెంపరేచర్ లో పెంచుతారు.మామూలు టెంపరేచర్ లోనే గుడ్లని స్టోర్ చేస్తారు.

అలాంటి గుడ్లని వేరే లెవల్ టెంపరేచర్లో, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం వలన కండెన్సెషన్ జరిగి, సాల్మొనెల్ల బ్యాక్టీరియా పెరుగుతుందని బ్రిటీష్ వారి వాదన.వారు ఏమంటారు అంటే, కోడ్లను పెంచడమే శుభ్రంగా, ఇన్ఫెక్షన్స్ కి దూరంగా పెంచాలి, అంతేతప్ప సడెన్ గా కొత్త టెంపరేచర్ లో పెట్టకూడదు అని అంటున్నారు.

అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టిన గుడ్లను సరిగా ఉడకవు అని బ్రిటిష్ వారు అంటారు.మరోవైపు అమెరికన్ వారు మాత్రం గుడ్లను ఫ్రిడ్జ్ లో పెట్టాలి అని అంటారు.

ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన సాల్మొనెల్ల బ్యాక్టీరియా వచ్చే అవకాశాలు తగ్గుతాయని వీరి వాదన.

కోడి ముందా గుడ్డు ముందా? దీనికి సరైన సమాధానం ఎవరికీ తెలియదు.కోడి మాంసాహారమా కాదా? దీనికి కూడా సరైన సమాధానం ఎవరు చెప్పలేరు.ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలా వద్ద అనే ప్రశ్న కూడా ఈ క్యాటగిరిలోకే వస్తుంది.

దీని మీద కూడా ఎవరు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube