అఖిల్ ఆఫర్ కాదన్న దర్శకుడు..!

అక్కినేని అఖిల్ లాంటి యంగ్ హీరో స్టార్ లెగసీ ఉన్న హీరో సినిమా చేద్దామంటే ఏ దర్శకుడైనా ఏమంటాడు చెప్పండి.కథ లేకున్నా ఆఫర్ వచ్చింది కాబట్టి రెడీ చేసి మరి చేద్దాం అనేస్తాడు.

 Pellichupulu Director Shock To Akhil-TeluguStop.com

కాని తరుణ్ భాస్కర్ మాత్రం తన దగ్గర నీకు సరిపడే కథ లేదని చెప్పేశాడట.రీసెంట్ గా పెళ్లి చూపులు సినిమాతో టోటల్ ఇండస్ట్రీనే షేక్ చేస్తున్న ఈ డైరక్టర్ అంతకుముందు తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ చూసి అఖిల్ కలవమన్నాడట.

అఖిల్ ను కలవడమే కాదు అఖిల్ ఆఫర్ కూడా అందుకున్నాడట.

అయితే అఖిల్ ఇచ్చిన అవకాశం సున్నితంగా తిరస్కరించిన తరుణ్ తన దగ్గర అఖిల్ కు సరిపోయే కథ లేదని చెప్పేశాడట.

ఆ తర్వాత ఇదిగో పెళ్లిచూపులు లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.మరి ఇప్పుడు ఎలాగు ఓ సక్సెస్ వచ్చింది కాబట్టి అఖిల్ కు సరిపోయే కథ ఇప్పుడైనా సిద్ధం చేస్తాడేమో చూడాలి.

పెళ్లి చూపులు సినిమా సక్సెస్ మీట్ లో రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన ఓ ఫంక్షన్ కు అఖిల్ రావడం పై విధంగా మాట్లాడటం జరిగింది.మరి అఖిల్ కు సరిపడే కథ రాస్తే మరో ఆలోచన లేకుండా అఖిల్ కూడా తరుణ్ తో సినిమా తీస్తానని ఇప్పటికి అంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube