రీతు మరో లక్కీ ఛాన్స్ పట్టేసింది..!

ఓ సినిమా హిట్ అందులో నటించిన వారి తలరాత మారుస్తుంది అంటే ఏంటో సరిగ్గా పెళ్లిచూపులు సినిమాలో నటించిన స్టార్ కాస్ట్ ను చూస్తే అర్ధమవుతుంది.అప్పటిదాకా ఎవరు పట్టించుకోని వీరిని ఇప్పుడు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

 Reetu Varma Lucky Chance With Nikhil-TeluguStop.com

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చి పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ ఇప్పటికే తన తర్వాత సినిమాలకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.ఇక పెళ్లిచూపులు హీరోయిన్ రీతు వర్మ ఫేట్ కూడా ఆ సినిమా హిట్ తో మారిపోయింది.

ఇప్పటికే అమ్మడికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట.ప్రస్తుతం అయితే నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు అమ్మడు ఓకే అయ్యింది.

స్వామిరారా సినిమాతో నిఖిల్ కెరియర్ లో మెమరబుల్ హిట్ అందించిన సుధీర్ వర్మ తన రెండో ప్రయత్నంగా చేసిన దోచేయ్ ఫ్లాప్ అవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు.ఇప్పుడు మరోసారి నిఖిల్ తో స్వామిరారా తరహా కథతో సినిమాకు సిద్ధమయ్యాడు.

ఇక ఇందులో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ కొట్టేసింది రీతు వర్మ.పెళ్లిచూపులు ముందు దాకా అడపాదడపా సినిమాల్లో కనిపించినా ఓ ఐడెంటిటీ సంపాదిచలేని రీతు వర్మ ఆ సినిమా హిట్ తో క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube