ఏవైనా పండుగలు వస్తున్నాయంటే టాలీవుడ్లో సందడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది.ప్రతి పండుగకు స్టార్ హీరోల సినిమాల నుండి చిన్న హీరోల సినిమాల వరకు ఎన్నో ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు వస్తూనే ఉంటాయి.
గత రెండు మూడు సంవత్సరాలుగా పండుగలకు ఈ ఫస్ట్‌లుక్‌లు విడుదల చేయడం పెరిగి పోయింది.ఇక నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా టాలీవుడ్లో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న మరియు చిత్రీకరణ పూర్తి అయ్యి విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాల ఫస్ట్‌లుక్ పోస్టర్స్ మరియు టీజర్స్ విడుదలయ్యాయి.
ఇందులో ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మూవీ పోస్టర్.ఈ పోస్టర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది.
ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని ఎన్టీఆర్ స్టిల్ కూడా రిలీజ్ అయ్యింది.ఆ తర్వాత మరో మెగా హీరో వరుణ్ తేజ్ ‘కంచె’ చిత్రం టీజర్ విడుదల అయ్యింది.
సునీల్ నటించిన ‘కృష్ణాష్టమి’ మూవీ ఫస్ట్‌లుక్‌ను కూడా నేడే విడుదల చేశారు.ఇంకా పలువురు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల స్టిల్స్ మరియు టీజర్లతో స్వాతంత్య్ర దినోత్సవంను ప్రేక్షకులతో పంచుకున్నారు.