పవన్ కళ్యాణ్ తిక్క .. త్రివిక్రమ్ కి చుక్కలు

పవన్ కళ్యాణ్ కి కొంచెం తిక్క ఉన్న విషయాన్ని ఆయన అభిమానులే ఒప్పుకుంటారు.కాని ఆ తిక్క ఒక్కోసారి లెక్క తప్పుతుంది.

 Pawan’s Laziness Landed Trivikram Into Trouble-TeluguStop.com

అక్కడే సమస్య.ఉదాహరణకి చెప్పాలంటే ఆల్రేడి డబ్ అయిన సినిమా రీమేక్ చేయడం.

ఇంకా చెప్పాలంటే సినిమాలు చేస్తూ, సినిమాలని పట్టించుకోకపోవడం.ఇప్పుడు పవన్ కళ్యాణ్ వలన త్రివిక్రమ్ కి చుక్కలు కనబడుతున్నాయి.

స్నేహం కోసం సినిమా ఒప్పుకుంటే, లేని కష్టాలు కొనితెచ్చుకున్నాడు మాటల మాంత్రికుడు.

పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకున్నప్పుడు పక్క ప్లాన్ వేసుకున్నారు త్రివిక్రమ్.

ఏ షెడ్యుల్ ఎప్పుడు మొదలవ్వాలి, ఎప్పుడు పూర్తవ్వాలి .ఇలా అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసారు.ఆ ప్లాన్ ప్రకారం సినిమా జులైలో పూర్తవ్వాలి, ఆగష్టులో విడుదల అవ్వాలి.కాని జులై అయిపోతున్నా, ఇంకా సగం కూడా పూర్తి కాలేదు.అక్టోబర్ లో తారక్ తో సినిమా ప్లాన్ చేసారు త్రివిక్రమ్.ఎన్టీఆర్ జై లవ కుశ పూర్తి చేసి ముందు అనుకున్న సమయానికి సిద్ధంగా ఉంటే, త్రివిక్రమ్ మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాతోనే ఉండాల్సిన పరిస్థితి.

ఆగష్టు నుంచి దసరాకి, దసరా నుంచి దీపావళికి, దీపావళి నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమా, ఇప్పుడు సంక్రాంతికి రావడం కూడా అనుమానమే అంటున్నారు.మరి ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోంది ?

పవన్ కళ్యాణ్ సహకరించడం లేదు.ఆయన షూటింగ్ కి సరిగా రాకపోవడం వలన, ఇతర ఆర్టిస్టుల డేట్స్ కూడా వృధ అవుతున్నాయి.మిగితా ఆర్టిస్టుల డేట్స్ మారితే సినిమా షెడ్యూల్స్ మొత్తం మారిపోతాయి.

ఇది నిజంగా పెద్ద తలనొప్పి, ఓ సన్నివేశంలో ఉండే అందరి డేట్స్ మ్యాచ్ చేయాలంటే అది మామూలు విషయం కాదు.మరోవైపు పవన్ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు రాడో, ఇది ఆయనకు కూడా తెలియదు.

మరి రాజకీయాల్లో ఏమైనా బిజీబిజీ పనులున్నాయా అంటే ప్రస్తుతానికైతే లేవు.మరి పవన్ ఇప్పుడే ఇలా ఉంటే, వచ్చే ఏడాది, రాజకీయాల్లో బిజీ అవుతుండగా, ఒప్పుకున్న మరో సినిమాని ఇంకెలా పూర్తి చేస్తారో !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube