పవనిజం అంటే భూతాలకి భయం .. మహేష్ ఫ్యాన్ మంచితనానికి ప్రతిరూపం

అర్థరాత్రి ఇద్దరు స్నేహితులు రోడ్డు మీద వెళుతున్నారు.ఇంతలో ఓ దెయ్యం వస్తుంది.

 Pawanism Vs Dhfm – Pawan – Mahesh Fans Foolishness-TeluguStop.com

ఇద్దరిలో ఒకడు భయపడి పారిపోతాడు.మరొకడు మాత్రం దేవుడు నాదగ్గర ఉండగ దెయ్యాలేం చేస్తాయి అని జేబులోంచి పవర్ స్టార్ ఫోటో తీస్తాడు.

పవనిజం పవర్ చూసి దెబ్బకి దెయ్యం పారిపోతుంది.

ఏంటి సినిమా కథ చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇది సినిమా కథే.సినిమా అంటే ఓ షార్ట్ ఫిలిమ్.ఇలాంటిదే మరో అద్భుతమైన షార్ట్ ఫిలిం కథ ఉంది, చెబుతాం.

మళ్ళీ అర్థరాత్రి .రోడ్డు మీద అప్పుడే పార్టీకి వెళ్ళివచ్చిన ఓ అమ్మాయి.ఫోన్ స్విచ్చాఫ్.బస్సులు రావట్లేదు.ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియదు.అటువైపు నుంచి కొన్ని బైక్స్ వెళ్ళినా, ఆ అమ్మాయి ఎవరిని లిఫ్ట్ అడగదు.

ఇంతలో ఓ అబ్బాయి వస్తే అతడిని లిఫ్ట్ అడుగుతుంది.అతను ఇంటివద్ద డ్రాప్ చేస్తాడు.

తిరిగి వెళుతూ ఓ ప్రశ్న అడుగుతాడు.ఈ రాత్రిపూట కేవలం తన మీదే ఎందుకు నమ్మకం కలిగిందని .అప్పుడు ఆ అమ్మాయి ఏం చెబుతుందో తెలుసా? అతని బైక్ మీద మహేష్ బాబు DHFM సింబల్ చూసి నమ్మానని.మహేష్ లాగే మహేష్ అభిమానులు మంచితనానికి ప్రతిరూపాలని.

DHFM అంటే Die Hard Fan of Mahesh .పవన్ అభిమానులు ఎలాగైతే పవనిజం అని రచ్చ చేస్తారో, ఈ DHFM పేరుతో మహేష్ అభిమానులు అలాంటి రచ్చే చేస్తారు.

వీళ్ళ వెర్రి అభిమానం ఎలాంటిది అంటే ఒక బ్యాచ్ చేసే వింత వింత షార్ట్ ఫిలిమ్స్ ని మరో బ్యాచ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ గొడవలు పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube