పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ జనసేన మూడు వసంతాలు పూర్తి చేసుకుంది.ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాడు.
ఆ ఎన్నికల్లో పవన్ ఏపీ, తెలంగాణలో బీజేపీ+టీడీపీ కూటమికి బలంగా సపోర్ట్ చేశాడు.అయితే ఆ ఎన్నికల్లో రెండు పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అవ్వడంతో పవన్ వాటిపై స్వరం పెంచాడు.
ఈ రెండు పార్టీల తీరును ఎండగట్టాడు.
ఇక కొద్ది రోజులుగా ఏపీలో వరుసగా భారీ సభలు పెడుతూ వస్తోన్న పవన్ జనసేన మూడో వార్షికోత్సవం సందర్భంగా ప్రెస్‌మీట్ పలు సంచలన విషయాలపై ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసేశాడు.
ఇక అనంతపురం పర్యటనలో పవన్ తాను కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు.ఇక తాజాగా మూడో వార్షికోత్సవం సందర్భంగా పెట్టిన ప్రెస్మీట్లో కూడా పవన్ జనసేన 2019లో జరిగే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తుందని చెప్పిన పవన్ తాను మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచే పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.
దీంతో పవన్ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తే ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బరిలో ఉంటారన్న ప్రశ్నలు మరోసారి రైజ్ అయ్యాయి.
జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే అందులో రెండు రిజర్వ్ నియోకవర్గాలు మినహాయిస్తే 12 జనరల్ నియోజకవర్గాలు ఉన్నాయి.
కులం, వర్గం సమీకరణాలు తీసుకుంటే పవన్ ఫస్ట్ ప్రయారిటీ అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.ఇక రెండో ఆప్షన్‌గా అదే జిల్లాలోని గుంతకల్ పేరు వినపడుతోంది.
మరి ఫైనల్‌గా పవన్ ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటాడో చూడాలి.