ఆ ముగ్గురు హీరోల్లో పవన్ కి ఎవరితో పోటీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ మొత్తానికి ఊపందుకుంది.ఎప్పుడో మొదలై, నత్తనడకన సాగిన షూటింగ్ ఇప్పుడు గాడిలో పడింది.

 Pawan To Clash With Anyone Of Mahesh, Balakrishna And Allu Arjun-TeluguStop.com

ప్రస్తుతం, హైదరాబాద్ లో ఒక చిన్న షెడ్యుల్ జరుపుకుంటున్న సర్దార్ వచ్చే వారం గుజరాత్ పయనమవుతాడు.స్వయంగా పవన్ గుజరాత్ వెళ్లి సెలెక్ట్ చేసిన లోకేషన్స్ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ జరగనుంది.

అదే షెడ్యుల్ లో కాజల్ కూడా యూనిట్ తో చేరుతుంది.

సినిమా ప్రారంభానికి ముందే 2016 సంక్రాంతికి సినిమా వస్తుందని అనౌన్స్ చేసారు చిత్ర నిర్మాతలు.

షూటింగ్ సజావుగా సాగుతుండటంతో మళ్ళి సంక్రాంతి ఆశలు చిగురించాయి పవర్ స్టార్ అభిమానుల్లో.సంక్రాంతి కి వస్తే బాలయ్య బాబుతో పోటిపడాలి.

ఇది దాదాపు ఆసాధ్యం.అంత త్వరగా సినిమా పూర్తవదు.

జనవరి తప్పితే, ఫిబ్రవరి ఆఖర్లో లేదా మార్చి మొదట్లో రావాలనుకుంటే అల్లు అర్జున్ సరైనోడుతో పోటి పాడాల్సి రావచ్చు.ఎందుకంటే బన్ని సినిమా ఆ సమయంలోనే విడుదల చేసే అవకాశాలున్నాయి.

అయితే గీత ఆర్ట్స్ బ్రహ్మోత్సవం వచ్చిన తరువాతే విడుదల చేద్దామనే యోచనలో ఉన్నట్లు కుడా తెలుస్తోంది.దీన్ని బట్టి చుస్తే మామ-అల్లుళ్ళ పోటి కుడా జరగదు.

ఇక ఏప్రిల్ కి సర్దార్ ని షిఫ్ట్ చేస్తే తన బాక్సాఫీస్ శత్రువు మహేష్ బాబు తో పోటిపాడాలి.ఎందుకంటే బాక్సాఫీస్ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ లో జరగోచ్చు.

చివరిసారి మహేష్, పవన్ పోటి పడింది పోకిరి, బంగారం సమయంలో.

బాలకృష్ణ, అల్లు అర్జున్, మహేష్ బాబు .ఈ ముగ్గురు హీరోల్లో ఎవరితో పోటి పడతాడో మన పవర్ స్టార్ !

Pawan Kalyan, Sardaar Gabbar Singh, brahmotsavam,Dictator, Sarinodu

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube