పవన్ టార్గెట్ టీడీపీనా!!

పవన్ కల్యాణ్ ఇప్పుడు యూత్ హీరోనే కాదు…యూత్ లీడర్ కూడా.అయితే అటు సినీ ప్రస్థానాన్ని.

 Pawan Targets Tdp??-TeluguStop.com

ఇటు రాజకీయ జీవితాన్ని సమానంగా సరిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు పవర్ స్టార్.ఇక ఇదే కోవలో మొన్న శుక్రవారం విడుదలయిన గోపాల.

గోపాల చిత్రం పవన్ పొలిటికల్ కరీర్ పై ఒకింత ప్రభావాన్ని చూపించే చిత్రంగా విశ్లేషకులు భావిస్తున్నారు.అందులో పవన్ చెప్పిన డైలాగులు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీనే టార్గెట్ గా రాయించుకున్నట్లు సైతం వార్తలు వస్తున్నాయి.

ఆ చిత్రంలో గెలిచేవాడు నాయకుడు కాదు-గెలిపించేవాడు నాయకుడు… కొన్నిసార్లు రావడం లేటవచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా.సమర్థులు మాకెందుకని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులు రాజ్యమేలతారు… ఇలాంటి డైలాగ్స్ టీడీపీ సర్కారను ఉద్దేశించి రాయించినవేనని వాదన బలంగా వినిపిస్తుంది.

ఇక అవన్నీ కామన్ డైలాగ్స్ అని అందరికి అనిపించినప్పటికీ తేలికగా తీసి పారెయ్యలేము.కాకపోతే ఎక్కడా ఎవరినీ ఉద్దేశించినట్టు కనిపించకపోయినా…నేరుగా పార్టీల ప్రస్తావన రాకపోయినా ఒకింత విమర్శలకు తావిచ్చేవిగా ఆ డైలాగ్స్ ఉన్నాయి.

ఇక గత ఎన్నికల్లో పవన్ పోషించిన పాత్రను ఉద్దేశించే ఈ డైలాగ్స్ ఉన్నాయి అని అభిమానులు చెబుతున్నారు.మరి గతంలో సైతం జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి హీరోల సినిమాల డైలాగులు ఇలానే వివాదాస్పదం అయిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

మరి ఇవి ఉద్దేశపూర్వకంగా చెప్పినవా.లేక స్టోరీలో భాగమయ అనేది పవన్ కే తెలియాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube