పవన్ - త్రివిక్రమ్ సినిమా రికార్డు ... దాని టైటిల్ ఇదే ?

జల్సా, అత్తారింటికి దారేది లాంటి భారి హిట్లు సాధించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.వీరి కాంబినేషన్లో లాస్ట్ టైం వచ్చిన సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో ఇప్పుడు వస్తున్న మూడోవ సినిమా మీద భారి అంచనాలు ఉన్నాయి.

 Pawan Sets New Record .. Tentative Title In News For Pspk 25-TeluguStop.com

అందుకే సినిమా బిజినెస్ కూడా అంచనాలకు మించి జరుగుతోంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ స్పైడర్ కి మించి ఉండబోతోంది.

ఇక వరల్డ్ వైడ్ గా స్పైడర్ ని దాటడం కష్టమే అయినా, శాటిలైట్ హక్కుల విషయంలో మాత్రం స్పైడర్ కి తిరుగులేని జవాబు దొరికింది.

జెమిని టీవి ఈ సినిమా టెలికాస్ట్ హక్కులని ఎంతకి కొన్నదో తెలుసా ? 21 కోట్లు.అవును, మొదట 19.50 కోట్లకు ఫైనలైజ్ అవుతుంది అనుకున్న డీల్ కాస్త మరో కోటిన్నర పెరిగి 21 కోట్ల వద్ద సెటిల్ అయ్యింది.ఇది తెలుగు వెర్షన్ వరకు భారి రికార్డు.ఇంతకుముందు నాన్ – బాహుబలి చిత్రాల్లో ఈ రికార్డు స్పైడర్ పేరిట ఉండేది.ఇక హిందీ శాటిలైట్ ఏకంగా 11 కోట్లకు అమ్ముడుపోవడం ఆశ్చర్యకరం.ఇక్కడ కూడా స్పైడర్ ని బీట్ చేసింది పవన్ కళ్యాణ్ సినిమా.

స్పైడర్ హిందీ శాటిలైట్ హక్కులు 10 కోట్లకు అమ్ముడుపోగా, త్రివిక్రమ్ సినిమా ఓ కోటి ఎక్కువే చేసింది.

స్పైడర్ తెలుగు హిందీ శాటిలైట్ కలిపి 26 కోట్లు సాధిస్తే, పవన్ – త్రివిక్రమ్ సినిమా ఏకంగా 32 కోట్లు చేసింది.(21+11).ఇంకా స్పైడర్ కి సంబంధించి తమిళం, మలయాళం శాటిలైట్ హక్కులు అమ్మలేదు కాబట్టి, అప్పటివరకు ఆ రికార్డు పవన్ కళ్యాణ్ సినిమాదే.

అలాగే భరత్ అనే నేను సినిమాకి జెమిని టీవి ప్రస్తుతం అడుగుతున్న రేటు 22 కోట్లు, నిర్మాతలు 25 అడుగుతున్నారు.మరి ఈ డీల్ సెట్ అయినా, రికార్డు త్వరలోనే తిరిగిపొందుతాడు ప్రిన్స్.

ఇక పవన్ 25వ సినిమాకు ఒక ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలో ఉంది.అదే “ఇంజనీర్ అల్లుడు”.

ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.కీర్తి సురేష్, అను ఏమ్మానుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని హారిక & హాసిని క్రియేషన్స్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube