Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

పవన్ - త్రివిక్రమ్ సినిమా రికార్డు ... దాని టైటిల్ ఇదే ?-Pawan Sets New Record .. Tentative Title In News For PSPK 25

జల్సా, అత్తారింటికి దారేది లాంటి భారి హిట్లు సాధించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరి కాంబినేషన్లో లాస్ట్ టైం వచ్చిన సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో ఇప్పుడు వస్తున్న మూడోవ సినిమా మీద భారి అంచనాలు ఉన్నాయి. అందుకే సినిమా బిజినెస్ కూడా అంచనాలకు మించి జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ స్పైడర్ కి మించి ఉండబోతోంది. ఇక వరల్డ్ వైడ్ గా స్పైడర్ ని దాటడం కష్టమే అయినా, శాటిలైట్ హక్కుల విషయంలో మాత్రం స్పైడర్ కి తిరుగులేని జవాబు దొరికింది.

జెమిని టీవి ఈ సినిమా టెలికాస్ట్ హక్కులని ఎంతకి కొన్నదో తెలుసా ? 21 కోట్లు. అవును, మొదట 19.50 కోట్లకు ఫైనలైజ్ అవుతుంది అనుకున్న డీల్ కాస్త మరో కోటిన్నర పెరిగి 21 కోట్ల వద్ద సెటిల్ అయ్యింది. ఇది తెలుగు వెర్షన్ వరకు భారి రికార్డు. ఇంతకుముందు నాన్ – బాహుబలి చిత్రాల్లో ఈ రికార్డు స్పైడర్ పేరిట ఉండేది. ఇక హిందీ శాటిలైట్ ఏకంగా 11 కోట్లకు అమ్ముడుపోవడం ఆశ్చర్యకరం. ఇక్కడ కూడా స్పైడర్ ని బీట్ చేసింది పవన్ కళ్యాణ్ సినిమా. స్పైడర్ హిందీ శాటిలైట్ హక్కులు 10 కోట్లకు అమ్ముడుపోగా, త్రివిక్రమ్ సినిమా ఓ కోటి ఎక్కువే చేసింది.

స్పైడర్ తెలుగు హిందీ శాటిలైట్ కలిపి 26 కోట్లు సాధిస్తే, పవన్ – త్రివిక్రమ్ సినిమా ఏకంగా 32 కోట్లు చేసింది. (21+11). ఇంకా స్పైడర్ కి సంబంధించి తమిళం, మలయాళం శాటిలైట్ హక్కులు అమ్మలేదు కాబట్టి, అప్పటివరకు ఆ రికార్డు పవన్ కళ్యాణ్ సినిమాదే. అలాగే భరత్ అనే నేను సినిమాకి జెమిని టీవి ప్రస్తుతం అడుగుతున్న రేటు 22 కోట్లు, నిర్మాతలు 25 అడుగుతున్నారు. మరి ఈ డీల్ సెట్ అయినా, రికార్డు త్వరలోనే తిరిగిపొందుతాడు ప్రిన్స్.

ఇక పవన్ 25వ సినిమాకు ఒక ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలో ఉంది. అదే “ఇంజనీర్ అల్లుడు”. ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్, అను ఏమ్మానుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని హారిక & హాసిని క్రియేషన్స్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Continue Reading
More Posts
To Top