పవన్, సూర్య అసలు విషయం అదట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషితో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు ఎస్.జె సూర్య ఆ తర్వాత అదే పవన్ తో పులి సినిమా తీసి ఫ్లాప్ కొట్టాడు.

 Pawan, S.j.surya Matter Leaked-TeluguStop.com

వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాకు పిలిచి మరి డైరక్షన్ ఛాన్స్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్.అయితే ఏమైందో ఏమో ఆ సినిమా నుండి ఎస్.జె.సూర్య సడెన్ గా డ్రాపవుట్ అయ్యాడు.ఎస్.జె సూర్య తమిళంలో బిజీ ఆర్టిస్ట్ అవ్వబట్టే ఈ సినిమా నుండి వెళ్లాడని వార్తలు వచ్చాయి.

అది ఓ కారణం అని తెలుస్తున్నా సూర్య పవన్ సినిమా నుండి బయటకు వెళ్లడానికి మరో కారణం కూడా ఉందట అదే అతని రెమ్యునరేషన్.ఆల్రెడీ ఫ్లాపుల్లో ఉన్న అతనికి పిలిచి మరి అవకాశం ఇస్తున్నారు కాబట్టి కోటి లోపే రెమ్యునరేషన్ ఇస్తామని అన్నారట.

దానికి ముందు సరే అన్నా సినిమా ఎక్కువ టైం పడుతుందని భావించి ఇంకా పెంచాల్సిందిగా కోరాడట.ఇక మరో పక్క తాను తమిళంలో నటించిన సినిమాలు హిట్ అవ్వడంతో అక్కడ నుండి భారీ ఆఫర్లు మంచి రెమ్యునరేషన్ తో వచ్చాయట.

అందుకే సినిమా నుండి మర్యాద పూర్వకంగా తప్పుకున్నాడట సూర్య.సో అలా పవర్ స్టార్ తో సినిమా చాన్స్ వదులుకున్నాడు ఎస్.జె సూర్య.ఇక మురుగదాస్ మహేష్ తో తీస్తున్న క్రేజీ మూవీలో కూడా సూర్య విలన్ గా నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube