పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ స్వయంగా కథ మరియు స్క్రీన్‌ప్లే అందించాడు.
ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.ఇక ఈ సినిమా పూర్తి అయిన సమయంలో ‘రాజా సర్దార్ గబ్బర్‌సింగ్’ అంటూ టైటిల్ వేశారు.
దాంతో తాజాగా గబ్బర్‌సింగ్‌కు మూడవ పార్ట్ ఉంటుందా అనే చర్చ మొదలైంది.పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశ్యంతో వేశాడో అంటూ ప్రస్తుతం ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.
పవన్ ఫ్యాన్స్ నేడు సినిమా విడుదల సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్ వద్ద తెగ సందడి చేస్తున్నారు.భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేసిన విషయం తెల్సిందే.
తెలుగుతో పాటు హిందీలో సైతం ఈ సినిమాను భారీ థియేటర్లలో విడుదల చేశారు.కాజల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సంజన ముఖ్య పాత్రలో కనిపించగా, రాయ్ లక్ష్మి ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటే అది ఎప్పుడు, ఎలా ఉంటుందా అని ఇప్పటి నుండే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.