2019లో " జ‌న‌సేన " కూట‌మి ఇదేనా..!

ఏపీలో 2019 ఎన్నిక‌ల‌కు మ‌రో రెండున్న‌రేళ్ల టైం ఉన్నా అప్పుడే రాజకీయ వేడి రగులుతోంది.2019 కురుక్షేత్రానికి రంగం సిద్ధం అవుతుంది.గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ+బీజేపీ కూట‌మి, వైకాపాల‌తో పాటు కాంగ్రెస్, మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్ రెడ్డి జై స‌మైక్యాంధ్ర పార్టీలు పోటీ ప‌డినా ప్ర‌ధాన పోటీ మాత్రం టీడీపీ+ బీజేపీ కూట‌మి వైకాపా మ‌ధ్యే జ‌రిగింది.అయితే 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ఆ ప‌రిస్థితి ఉండే ఛాన్సులు లేవు.

 Pawan Meets Cpi Leaders Over 2019 Poll Alliances-TeluguStop.com

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ+ బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేసినా ప్ర‌ధాన కాన్‌సంట్రేష‌న్ అంతా ఏపీ మీదే కేంద్ర‌క‌రించ‌డం క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టే.ఈ క్ర‌మంలోనే 2019లో తెలంగాణ‌లో ఎలా ఉన్నా ఏపీలో మాత్రం ట్ర‌యాంగిల్ ఫైట్ జ‌రుగుతుంద‌న్న చ‌ర్చ‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో స్టార్ట్ అయ్యాయి.

టీడీపీ+ బీజేపీ కూట‌మి – వైకాపా – జ‌న‌సేన పార్టీల మ‌ధ్య అధికారం జ‌రిగే పోరు ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుంది.ఈ క్ర‌మంలోనే టీడీపీ మ‌రోసారి అధికారం నిలుపుకునేందుకు ట్రై చేస్తుంటే.

ఎట్టి ప‌రిస్థితుల్లోను 2019లో గెలిచి సీఎం పీఠం ద‌క్కించుకోవాల‌ని విప‌క్ష వైకాపా అధినేత జ‌గ‌న్ ఎంతో శ్ర‌మిస్తున్నారు.ఇక తొలిసారిగా పోటీ చేస్తోన్న జ‌న‌సేన సైతం ఈ రెండు పార్టీల‌ను ఓడించేందుకు ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతోంది.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ పొత్తుల‌కు సైతం రెడీగా ఉన్న‌ట్టు టాక్ వ‌స్తోంది.

ఈ పొత్తుల్లో భాగంగా వైకాపా సీపీఎంకు ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోండ‌గా, జ‌న‌సేన సీపీఐతో జ‌త క‌ట్టే ఛాన్సులు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌ను గురువారం ఆ పార్టీ కార్యాలయంలో సీపీఐ నేతలు ఏపీ కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయుసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావులు క‌లిశారు.వీరిని ప‌వ‌న్ సాదారంగా ఆహ్వానించారు.

వీరి మ‌ధ్య ఏపీ ప్ర‌స్తుతం ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌తో పాటు, రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

కీల‌క‌మైన ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జనసేన, వామపక్షాలు కలిసి పోరాడే విషయంపై వీరు ఈ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌కు వామ‌ప‌క్షాల ప‌ట్ల సానుకూల అభిప్రాయం ఉండ‌డంతో జ‌న‌సేన‌-సీపీఐతో జ‌త క‌డుతుంద‌న్న చ‌ర్చ‌లు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి.అయితే ఏపీలో వామపక్షాల బలం అంతకంతకూ తగ్గిపోతున్న వేళ.అలాంటి వారితో కలిసి నడవాలనుకోవటం నష్టమే తప్పించి.లాభం ఎంతమాత్రం కాదన్న అభిప్రాయం కూడా కొన్ని వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రి ప‌వ‌న్ డెసిష‌న్ ఫైన‌ల్‌గా ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube