టాలీవుడ్లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ ఇద్దరి హీరోలకు ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాలతోను టచ్ ఉంది.
ఎన్టీఆర్ రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాడు.పవన్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు తమ ఫ్యామిలీ విషయంలో మాత్రం ఒకే రూటులో వెళుతున్నారు.చాలా కాలంగా వీరిద్దరు తమ కుటుంబాలకు దూరమవుతున్నారు.
మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలోను, ఈవెంట్లలోను పవన్ కనిపించి చాలాకాలమే అయ్యింది.మెగా హీరోల ప్రతి ఆడియో ఫంక్షన్లలోను పవర్‌స్టార్ గురించి ఫ్యాన్స్ నినాదాలు చేస్తూనే ఉంటారు.
మెగా హీరోలకు ప్రతిసారి పవన్ ప్రస్తావన వచ్చినప్పుడు సర్దిచెప్పుకోవడం చాలా కష్టంగానే ఉంటోంది.తన సినిమా ఆడియో ఫంక్షన్‌కు అన్న చిరు వచ్చినా పవన్ మాత్రం చిరు సినిమా ఫంక్షన్‌కు రాలేదు.
ఇక చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్లికి కూడా పవన్ రాలేదు.ఇక రాజకీయంగా కూడా అన్నదమ్ములు ఇద్దరూ వేర్వేరు రూట్లలో వెళుతుండడంతో పాటు మెగా ఫంక్షన్లకు పవన్ రాకపోవడం వెనక ఫ్యాన్స్‌లో కాస్త గ్యాప్ అయితే ఉంది.
నందమూరి యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటు తమ నందమూరి ఫ్యామిలీతో పాటు అటు నారా ఫ్యామిలీ ఫంక్షన్లలో కనిపించి చాలా యేళ్లు అవుతోంది.ఈ విషయమై నందమూరి అభిమానుల్లో ఎంతో కన్ఫ్యూజన్ ఉంది.
రీసెంట్గా నారా లోకేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి సైతం హరికృష్ణ, కళ్యాణ్‌రామ్ వచ్చినా ఎన్టీఆర్ రాలేదు.ఇక ఎన్టీఆర్ ఫంక్షన్లలో బాలయ్యను, బాలయ్య ఫంక్షన్లలో ఎన్టీఆర్‌ను చూసి చాలా రోజులైంది.
చంద్రబాబు ఇటీవల హైదరాబాద్‌లో కట్టుకున్న కొత్త ఇంటి గృహప్రవేశానికి కూడా ఎన్టీఆర్‌కు ఆహ్వానం లేదని వార్తలు వస్తున్నాయి.ఏదేమైనా ఈ ఇద్దరు టాప్ హీరోలు ఇండస్ట్రీలో స్టార్లుగా ఉన్నా ఫ్యామిలీ విషయంలో మాత్రం వాళ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.