శృతిహాసన్ .. ఎంత నష్టమో నీకు

ఎప్పుడో ఏప్రిల్ లో ముహూర్తం జరిగింది.ఆ తరువాత ఎస్ జే సూర్య సినిమాలోంచి తప్పుకోవడంతో, పవన్ కళ్యాణ్ 22వ సినిమా కొంతకాలం వాయిదా పడింది.

 Katamarayudu To Start Rolling From September 20th-TeluguStop.com

పోని, దర్శకుడు డాలి ఈ ప్రాజెక్టులోకి వచ్చాక అయినా, సినిమా మొదలైందా అంటే అదీ లేదు.జనసేన కార్యకర్తలతో కొంతకాలం, బహింరంగ సభలతో కొంతకాలం బిజిబిజీగా గడిపిన పవన్, ఇన్నిరోజులు “కాటమరాయుడు” చిత్రాన్ని దాదాపుగా గాలికి వదిలేసినంత పనే చేసాడు.

దీనివల్ల నష్టపోయింది ఎవరో తెలుసా? శృతిహాసన్.అవును, జూన్ నుంచి డేట్స్ ఇచ్చేసింది అమ్మడు.

కాని సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూపోయింది.ఈ గ్యాప్ లో మరో సినిమాకి ఆ డేట్స్ ఇచ్చుంటే, ఓ సినిమా పూర్తి చేసేదే శృతి.

ఏం చేస్తాం, పవన్ కళ్యాణ్ తో ఉన్న సత్సంబంధాల వలన ఏమి అనలేక అడ్జస్ట్ చేసుకుంటూ పోయింది.

ఆలస్యం జరిగితే జరిగింది కాని, మొత్తానికి ఈ సినిమా మొదలుకాబోతోంది.

ఈ నెల 20 నుంచి కాటమరాయుడు షెడ్యూలు హైదరాబాదులో మొదలుకాబోతోంది.పవన్ కళ్యాణ్ ఇదే నెల 24వ తేది నుంచి షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం.

ఇకనుంచైనా షూటింగ్ ప్లాన్ ప్రకారం అనుకున్న సమయంలో పూర్తి చేస్తే బెటర్.లేదంటే పాపం శృతి మరింతగా నష్టపోవాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube